T20 World Cup Final: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. ముఖ్యంగా జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను కోట్లాది మంది ఒకేసారి వీక్షించడం విశేషం.
మ్యాచ్ చివరి దశలో ఆసక్తి మరింత పెరిగింది. 19వ ఓవర్లో న్యూజిలాండ్ చివరి వికెట్ పడే సమయానికి జియో హాట్‌స్టార్‌లో లైవ్ వ్యూయర్‌షిప్ 75.5 కోట్లకు చేరింది. ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగి 82.1 కోట్లకు చేరింది.
లైవ్ స్ట్రీమింగ్ చరిత్రలో ఒకే సమయంలో నమోదైన పీక్ కాన్కరెంట్ వ్యూస్ పరంగా ఇది ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్‌ను వీక్షించడం క్రికెట్‌కు ఉన్న అపారమైన ఆదరణను మరోసారి చూపించింది.
ఈ రికార్డు తర్వాతి స్థానాల్లో కూడా క్రికెట్ మ్యాచ్‌లే ఉన్నాయి. భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సుమారు 6.5 కోట్ల పీక్ వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా జేక్ పాల్ – మైక్ టైసన్ బాక్సింగ్ మ్యాచ్ కూడా భారీ వ్యూయర్‌షిప్‌ను సాధించి జాబితాలో చోటు దక్కించుకుంది.
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ద్వారా నమోదైన ఈ రికార్డు డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ అభిమాన వర్గం ఈ సంఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైంది.
