Gold Price: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా ఇటీవల బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో గణనీయంగా పెరిగాయి. కొన్ని రోజుల క్రితం బంగారం ధరలు 2 శాతానికి పైగా పెరిగితే, వెండి ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి.
అయితే గత రెండు మూడు రోజులుగా ఈ ధరల్లో కొంత తగ్గుదల కనిపిస్తోంది. భారతీయులకు కొంత ఉపశమనం కలిగించేలా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్చి 9 ఉదయం నమోదైన ధరల ప్రకారం తులం బంగారం ధరలో కేవలం రూ.10 మాత్రమే తగ్గింది. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ.100 మేర తగ్గింది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటల సమయంలో నమోదైనవి మాత్రమే. మార్కెట్ పరిస్థితులను బట్టి రోజంతా ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
-
హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990.
-
విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990.
-
ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,790. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,014.
-
ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990.
-
చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,170. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,490.
-
బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990.
-
కేరళ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990.
ఇక వెండి ధర విషయానికి వస్తే, హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద ట్రేడవుతోంది.
ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి అంశాల ఆధారంగా రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరిన్ని మార్పులు కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
