Chicken: అబ్బ.. చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాలే రావు

Health Benefits of Eating Chicken Feet

Health Benefits of Eating Chicken Feet

Chicken Feet: నాన్‌ వెజ్‌ను ఇష్టపడే వారు చికెన్‌, మటన్ వంటి వంటకాలను ఎంతో రుచిగా ఆస్వాదిస్తూ తింటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కోడి కాళ్లు (చికెన్ లెగ్స్) కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని ఆహార నిపుణులు చెబుతున్నారు. కోడి కాళ్లతో చేసే కూర, సూప్ రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయని డైటీషియన్లు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా కోడి కాళ్లు తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎముకలకు మంచి శక్తి లభిస్తుంది. కీళ్ల నొప్పులు లేదా ఎముకల బలహీనతతో బాధపడేవారు వీటిని తీసుకుంటే ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే ఎముకల సమస్యలను కూడా కొంతవరకు నివారించవచ్చు.

అదేవిధంగా కోడి కాళ్లు కండరాల వృద్ధికి కూడా సహాయపడతాయి. వ్యాయామం చేసే వారు లేదా జిమ్‌కు వెళ్లి శరీరాన్ని బలంగా మార్చుకోవాలనుకునే వారికి ఇవి మంచి పోషకాహారం. వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే శరీరానికి శక్తి పెరిగి, కండరాలు కూడా బలపడతాయి.

Is Chicken Feet Healthy? Health Benefits

ఇక కోడి కాళ్లు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. వీటిలో ఉండే పోషకాలు చర్మాన్ని బిగుతుగా ఉంచి ముఖం కాంతివంతంగా కనిపించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం లోపం ఉన్నవారిలో అలసట, శరీర నొప్పులు కనిపిస్తాయి. అలాంటి వారు కోడి కాళ్లు తీసుకుంటే కాల్షియం లోపాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

బలహీనత, రక్తహీనత, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది మంచి ఆహారం. కోడి కాళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో మార్పులు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అదే విధంగా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి కూడా కోడి కాళ్లు ఉపయోగకరంగా ఉంటాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే మందులతో పాటు వీటిని తీసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

చలికాలంలో కోడి కాళ్లు తినడం మరింత మంచిదని చెబుతున్నారు. ఇవి శరీరానికి వేడి అందించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా కొంతవరకు రక్షణ కలిగిస్తాయి. అలాగే శరీర నొప్పులు తగ్గి, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Chicken feet - boiled Nutrition Facts | Calories in Chicken feet - boiled

కోడి కాళ్ల కూర, సూప్ ఎలా తయారు చేయాలి?

కోడి కాళ్లను కూరగా లేదా సూప్‌గా చేసుకుని తినవచ్చు. కూర చేయాలంటే చికెన్ కర్రీ మాదిరిగానే మసాలాలు వేసి వండుకోవచ్చు. సూప్ తయారుచేయాలంటే ముందుగా కోడి కాళ్లను బాగా శుభ్రం చేయాలి. తర్వాత ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మసాలాలు వేసి కొద్దిగా వేయించాలి. తరువాత నీళ్లు పోసి బాగా మరిగించాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి సర్వ్ చేసుకుంటే రుచికరమైన కోడి కాళ్ల సూప్ సిద్ధమవుతుంది.

ఈ విధంగా కోడి కాళ్లను సరైన మోతాదులో ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే ఎప్పుడూ మితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Chicken Feet Soup: A Nourishing and Delicious Delight – One Stop Halal

Also Read: Tollywood: 2026లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులు వీళ్లే..!

Chicken: అబ్బ.. చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాలే రావు