Free Bus: ఇలా ఉన్నారేంట్రా.. బస్సులో పళ్లు తోముకుంటూ మహిళ ప్రయాణం

Woman travels on bus while brushing teeth at Nagar Kurnool

Woman travels on bus while brushing teeth at Nagar Kurnool

Free Bus: తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ

బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ఆ మహిళ, బస్సును తన ఇంటిలా భావించినట్లుగా బ్రష్ చేస్తూ బయటకు ఉమ్ముతున్నట్లు వీడియోలో కనిపించింది. ఆమె ప్రవర్తన చూసి బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ ఘటనను గమనించిన కండక్టర్ ఆమెను ప్రశ్నించగా, మహిళ అతనికి కూడా సమాధానం ఇచ్చింది. “ఫ్రీ బస్సే కదా.. ఇంకా చాయ్ కూడా తాగలేదు. బస్సు ఆపుతావా?” అని ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఆమె ఇలా బస్సులోనే పళ్లు తోముకోవడం చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోవడంతో పాటు కొందరు ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

Also Read: Trump: మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడి..?