Iran internet blackout crosses 120 hours: Why Tehran is cracking down on anyone trying to get online
Iran internet: ఇజ్రాయెల్–అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 130 గంటలకు పైగా ఇంటర్నెట్ దాదాపు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కేవలం 1 శాతం మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉందని అంతర్జాతీయ ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థ ‘నెట్‌బ్లాక్స్’ వెల్లడించింది.
యుద్ధ పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల వల్లే ఇరాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దేశంలో జరుగుతున్న సైనిక కార్యకలాపాలు, అంతర్గత సమాచారం బయటకు లీక్ కాకుండా ఉండేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థలపై కఠిన నియంత్రణలు విధించినట్లు చెబుతున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మరియు ప్రాంతీయ యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ వ్యాప్తంగా గత ఆరు రోజులుగా ఇంటర్నెట్ సేవలు దాదాపు పూర్తిగా స్తంభించిపోయాయి. అంతర్జాతీయ వెబ్‌సైట్లు లేదా గ్లోబల్ ఇంటర్నెట్ సేవలను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్న వినియోగదారులకు టెలికమ్యూనికేషన్ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు కూడా నెట్‌బ్లాక్స్ తెలిపింది.
ఇరాన్‌లో ఈ ఏడాది అమలు చేసిన రెండో పెద్ద ఇంటర్నెట్ షట్‌డౌన్ ఇదే. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సమయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి.
ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థలను పరిమితం చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇంటర్నెట్ సేవలను ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న విషయంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read: Tirumala: తనూజ కోసం రిస్క్ లో పడ్డ దువ్వాడ మాధురి
Iran internet: 130+ గంటలుగా ఇరాన్ ఆఫ్‌లైన్!