Whatsapp: వాట్సాప్ వినియోగదారుల కోసం సంస్థ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం యూజర్లు తమ చాట్ లిస్టులో గరిష్టంగా మూడు చాట్స్ మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పరిమితిని పెంచేందుకు వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ప్రీమియం ప్లాన్‌లో భాగంగా ఒకేసారి 20 చాట్స్ వరకు పిన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కంపెనీ యోచిస్తోంది.
ప్రస్తుతం మూడు చాట్స్‌ను మాత్రమే పిన్ చేయగలుగుతున్నారు. మూడుకంటే ఎక్కువ చాట్స్‌ను పిన్ చేయాలని ప్రయత్నిస్తే, ఇప్పటికే గరిష్ట పరిమితి చేరుకున్నారని అలర్ట్ మెసేజ్ కనిపిస్తుంది. కానీ కొత్త ప్రీమియం ఫీచర్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిమితి 20 చాట్స్ వరకు పెరగనుంది. దీంతో ముఖ్యమైన చాట్స్‌ను ముందే పిన్ చేసుకుని, అవసరమైనప్పుడు వెంటనే ఓపెన్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ గ్రూపుల్లో పాల్గొనే వారు లేదా ఎక్కువగా చాట్స్ నిర్వహించే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఇటీవల విడుదలైన వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.26.6.1 అప్డేట్లో యాప్ ఐకాన్‌తో పాటు యాక్సెంట్ కలర్‌ను కూడా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్‌ను కంపెనీ అందించింది. ఈ ఫీచర్లు కూడా రాబోయే ప్రీమియం ప్లాన్‌లో భాగమయ్యే అవకాశం ఉందని సమాచారం.
అదేవిధంగా, తాజా వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.26.9.9లో చాట్ పిన్ పరిమితిని పెంచే ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. అయితే ఇది ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్‌కు కూడా అందుబాటులోకి రాలేదు.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రీమియం ప్లాన్ పూర్తిగా ఐచ్చికంగా ఉండనుంది. అంటే ఎక్కువ చాట్స్‌ను పిన్ చేసుకోవాలనుకునే యూజర్లు మాత్రమే దీనికి సబ్‌స్క్రైబ్ అవ్వాలి. ప్రస్తుతం ఉన్న మూడు చాట్స్ పిన్ పరిమితితో సంతృప్తిగా ఉన్న వారు ఎలాంటి మార్పులు లేకుండా వాట్సాప్‌ను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.
Also Read: Health Tips: అన్నం తింటున్నపుడు మధ్యలో నీళ్లు తాగితే..
Whatsapp: వాట్సాప్‌లో 20 చాట్స్ వరకు పిన్ చేయొచ్చు!
