హైదరాబాద్‌లో బంగారం ధరలు
తాజా తగ్గుదల తర్వాత హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,020గా ఉంది. ఉదయం ఇదే ధర రూ.1,70,500గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం రూ.1,55,850గా ఉండగా, ఉదయం 6 గంటల సమయంలో ఇది రూ.1,56,290గా ఉంది. అంటే కొద్దిగంటల్లోనే స్వల్పంగా ధరలు తగ్గాయి.
తెలుగు రాష్ట్రాల ఇతర నగరాల్లో రేట్లు
హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,020 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,850గా ఉంది. ఈ నగరాల్లో ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పరిస్థితి
ముంబై, బెంగళూరు, కేరళ, పుణే వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,020గా ఉంది. అక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.1,55,290గా నమోదైంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,170గా ఉండగా, చెన్నైలో తులం బంగారం ధర రూ.1,70,730గా ఉంది.
వెండి ధరలు భారీగా పతనం
వెండి ధరలు మాత్రం మరింతగా పడిపోయాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కిలో వెండిపై సుమారు రూ.20,000 వరకు తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,95,000గా ఉంది. అయితే హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,15,000గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే రేట్లు ఉన్నాయి.