Bank Holidays: బ్యాంకులకు భారీగా సెలవులు

March Bank Holidays 2026: Check Full List Of Dates Before You Plan

March Bank Holidays 2026: Check Full List Of Dates Before You Plan

Bank Holidays: ఫిబ్రవరి నెల ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, త్వరలోనే మార్చి నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నవారు ముందుగానే బ్యాంకు సెలవుల జాబితాను తెలుసుకోవడం మంచిది. ప్రతి నెలలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల సెలవుల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ఆ జాబితా ప్రకారం మార్చి నెలలో పండుగలు, ఆదివారాలు, రెండో-నాల్గవ శనివారాలు కలిపి మొత్తం అనేక రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇలా ఉన్నాయి:

  • మార్చి 1 – ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత.

  • మార్చి 2 – హోలికా దహన్ కారణంగా కాన్పూర్, లక్నోలో సెలవు.

  • మార్చి 3 – హోలీ రెండో రోజు సందర్భంగా బేలాపూర్, భోపాల్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, రాంచీ, విజయవాడల్లో బ్యాంకులు బంద్.

  • మార్చి 4 – అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భువనేశ్వర్, చండీగఢ్, ఇంఫాల్, ఇటానగర్, జమ్మూ, న్యూఢిల్లీ తదితర నగరాల్లో సెలవు.

  • మార్చి 8 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత.

  • మార్చి 13 – చాప్చర్ కుట్ కారణంగా ఐజ్వాల్‌లో సెలవు.

  • మార్చి 14 – రెండో శనివారం, అన్ని బ్యాంకులు బంద్.

  • మార్చి 15 – ఆదివారం సెలవు.

  • మార్చి 17 – షబ్-ఎ-ఖాదర్ కారణంగా జమ్మూ, శ్రీనగర్‌లో సెలవు.

  • మార్చి 19 – గుడి పడ్వా/ఉగాది సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, విజయవాడ తదితర నగరాల్లో బ్యాంకులు మూసివేత.

  • మార్చి 20 – ఈద్-ఉల్-ఫితర్/జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడల్లో సెలవు.

  • మార్చి 21 – రంజాన్ ఈద్ సందర్భంగా కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం, విజయవాడ తప్ప మిగతా నగరాల్లో సెలవు.

  • మార్చి 22 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.

  • మార్చి 26 – శ్రీరామ నవమి కారణంగా అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై తదితర నగరాల్లో సెలవు.

  • మార్చి 27 – శ్రీరామ నవమి (చైతి దాసైన్) సందర్భంగా హైదరాబాద్, పాట్నా, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో సెలవు.

  • మార్చి 28 – నాల్గవ శనివారం, అన్ని బ్యాంకులు మూసివేత.

  • మార్చి 29 – ఆదివారం సెలవు.

  • మార్చి 31 – మహావీర్ జయంతి కారణంగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో బ్యాంకులు పూర్తిగా బంద్.

కాబట్టి మార్చి నెలలో బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు మాత్రం సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అవసరమైన పనులను ఆలస్యం కాకుండా ముందే పూర్తి చేసుకుంటే ఇబ్బందులు తప్పుతాయి.

Also Read: Gold Rates: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు

Bank Holidays: బ్యాంకులకు భారీగా సెలవులు