Gemini Auto Browse: ఫారమ్ ఫిల్ చేయాలన్నా, గ్రోసరీ ఆర్డర్ పెట్టాలన్నా, ఫ్లైట్ బుక్ చేయాలన్నా బద్దకంగా ఉందా? ఇక ఆ బాధ Google చూసుకుంటుంది. Google తాజాగా Android Chrome లో కొత్త ఫీచర్ తెచ్చింది – Gemini Auto Browse. ఇప్పటివరకు Gemini కేవలం సమాధానాలు చెప్పేది, ఇప్పుడు ఏకంగా మీ బదులు వెబ్ సైట్లలోకి వెళ్లి పని చేసేస్తుంది.
ఏం చేయగలదు?
1. Multi-step Shopping: “పాలకూర పప్పు చేయడానికి కావాల్సినవన్నీ కార్ట్ లో వేయి” అని చెబితే చాలు, Gemini ఏకంగా Blinkit, Amazon లోకి వెళ్లి సరుకులన్నీ వెతికి కార్ట్ లో వేసేస్తుంది.
2. Smart Form Filling: చిన్న ఫోన్ స్క్రీన్ లో ఫారం నింపడం నరకం. Gemini ఆటోమేటిక్ గా మీ పేరు, అడ్రస్, వివరాలన్నీ Google నుండి తీసుకుని ఫిల్ చేస్తుంది.
3. Booking & Comparison: “Central Park దగ్గర రేపు 7 గంటలకు టేబుల్ బుక్ చెయ్” అంటే హోటల్ సైట్లన్నీ తిరిగి బెస్ట్ ఆప్షన్ వెతుకుతుంది.

ఎలా వాడాలి?
ముందుగా నీకు Google AI Pro లేదా Ultra సబ్స్క్రిప్షన్ ఉండాలి. Chrome లేటెస్ట్ వెర్షన్, లాంగ్వేజ్ English లో ఉండాలి.
Chrome ఓపెన్ చేసి పైన/కింద ఉండే Ask Gemini బార్ నొక్కి “నా కాంటాక్ట్ తో ఫారం ఫిల్ చెయ్” అని చెప్పండి. Gemini ఏ సైట్ కి వెళ్తుందో, ఏం చేస్తుందో ప్లాన్ చూపిస్తుంది. “Start Task” నొక్కితే చాలు, అది ఆటోమేటిక్ గా పేజీలు తిరుగుతూ ఫిల్ చేస్తుంది.
Safe ఏనా?
Google 4 గార్డ్ రైల్స్ పెట్టింది:
- Payment దగ్గర ఆగిపోతుంది: ఫైనల్ పేమెంట్ మాత్రం నువ్వే చేయాలి, Gemini చేయదు.
- ఎప్పుడైనా ఆపొచ్చు: Pause, Stop, Take Over అని ఎప్పుడైనా నొక్కొచ్చు.
- డేటా సేఫ్: నువ్వు చెప్పిన ట్యాబ్ లు మాత్రమే చూస్తుంది, మిగతావి చూడదు.
- లిమిట్: Pro వాళ్లకు రోజుకి 20 టాస్క్ లు, Ultra వాళ్లకు 200 టాస్క్ లు.
ఇకపై బ్రౌజింగ్ బద్దకస్తులకు పండగే!
Also Read: Orkut is Coming Back: ఇన్ స్టా, ఫేస్ బుక్ కి గట్టి దెబ్బ – ఆర్కుట్ మళ్లీ వస్తోంది..!
