Arjun Parmar: 18 వేల జీతంతో మొదలు – 3 ఏళ్లలో 75 లక్షలు – లేఆఫ్ ని కూడా ఓడించిన కుర్రాడి కథ

Arjun Parmar: How this 26-year-old made Rs 75 lakh in 3 years

Arjun Parmar: ఉజ్జయినిలో చిన్న ఎలక్ట్రికల్ షాపు నడిపే రాజేష్ కొడుకు అర్జున్ పర్మార్(Arjun Parmar). చిన్నప్పటి నుండి కంప్యూటర్ అంటే పిచ్చి. కష్టపడి NIT లో సీటు తెచ్చుకున్నాడు, కానీ వచ్చింది మెకానికల్ బ్రాంచ్. కల కాస్త కలగానే మిగిలిపోయిందా అనిపించింది.

ప్లేస్‌మెంట్స్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు “నువ్వు మెకానికల్, కుదరదు” అన్నాయి. ఫ్రెండ్స్ అంతా జాబ్ లు కొడుతుంటే వీడు కరోనా టైంలో రూమ్ లో కూర్చుని రోజూ 5 గంటలు కోడింగ్ నేర్చుకున్నాడు.

2023లో మొదటి జాబ్ Tech Mahindra లో. జీతం నెలకు కేవలం రూ. 18,000. నలుగురు నవ్వారు. కానీ వాడు 7 వేలు ఇంటికి పంపి, 5 వేలతో SIP మొదలుపెట్టాడు.

Rs 18,000 to Rs 4.2 lakh a month: How this 26-year-old built a Rs 75 lakh  portfolio in 3 years - Money News | The Financial Express

15 నెలల తర్వాత అదృష్టం తలుపు తట్టింది. Accenture లో నెలకు లక్ష రూపాయల జాబ్. బెంగళూరు వచ్చాడు, కానీ BMTC బస్సులోనే తిరిగాడు, ఖర్చు 45 వేలు దాటనివ్వలేదు. జీతం పెరిగింది, జీవనశైలి పెంచలేదు.

2025 ఆగస్టులో పెద్ద జాక్‌పాట్ – FAANG కంపెనీలో రూ. 45 లక్షల ప్యాకేజ్. 25 ఏళ్లకే లైఫ్ సెటిల్ అనుకున్నాడు. కాస్త ఖర్చు పెరిగింది. అప్పుడే దెబ్బ పడింది. మే 2026లో లేఆఫ్. 45 లక్షల జీతం జీరో అయ్యింది. కానీ దాచుకున్న 6 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ వాడిని కాపాడింది.

మళ్లీ మొదటి నుండి. కోడింగ్, ఇంటర్వ్యూలు, 4 రిజెక్షన్స్. చివరకు సెప్టెంబర్ 2026లో మళ్లీ అదే స్థాయి కంపెనీలో రూ. 50 లక్షల ప్యాకేజ్.

ఇప్పుడు వాడి దగ్గర రూ. 75 లక్షల ఆస్తులు, అమ్మానాన్నలకు ఉజ్జయినిలో 45 లక్షల సొంత ఇల్లు. వాడి మంత్రం ఒక్కటే – జీతం పెరిగినప్పుడు ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్ పెంచాలి.

Also Read: Raj Reddy Siri Alexa Creator: ఇసుకలో అక్షరాలు రాసిన కుర్రాడు – Siri, Alexa లను కనిపెట్టాడు!