No 1 Male Cricketer: ఇండియాలో నం.1 క్రికెటర్ ఇతడే..!

No 1 Male Cricketer

No 1 Male Cricketer: భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరోసారి ఆయనకు అరుదైన గుర్తింపు లభించింది. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) సర్వేలో విరాట్ కోహ్లీ దేశంలో నంబర్‌ వన్ ఇండియన్ మేల్ క్రికెటర్‌(No 1 Male Cricketer)గా నిలిచారు. అభిమానుల్లో కోహ్లీకి ఉన్న ఆదరణకు ఈ ఫలితాలు మరోసారి అద్దం పడుతున్నాయి.

ఈ సర్వేలో భారత పురుషుల క్రికెట్‌ జట్టుకు చెందిన పలువురు స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, మహేంద్ర సింగ్ ధోనీ, శుభ్‌మన్ గిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ, రోహిత్‌లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు యువ ఆటగాళ్లకు పెరుగుతున్న ఆదరణ కూడా ఈ జాబితాలో కనిపిస్తోంది.

Also Read: Arjun AK: కుంటుకుంటూ వచ్చి.. చివరి బంతికి సిక్స్! అసలైన ఆట అంటే ఇదే

Virat Kohli Becomes No.1 ODI Batter After 4 Years, Replaces Rohit Sharma

ఇక భారత మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే.. స్మృతి మంధాన నంబర్‌ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ వరుస స్థానాల్లో నిలిచారు. భారత మహిళా క్రికెట్‌లో స్మృతి మంధానకు ఉన్న ప్రజాదరణను ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

కేవలం క్రికెటర్లకే కాకుండా ఇతర క్రీడాకారుల విషయంలోనూ MOTN సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి. నంబర్‌ వన్ మేల్ స్పోర్ట్స్ పర్సన్‌గా జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా నిలిచారు. అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రదర్శనలతో దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన నీరజ్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ ఈ ఫలితాల్లో ప్రతిబింబించింది.

Also Read: Dream Job: మేఘాలను వీడియో తీయడమే జాబ్.. జీతం రూ.8.5లక్షలు!

మహిళా క్రీడాకారుల జాబితాలో పీవీ సింధు అగ్రస్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్‌లో ఎన్నో విజయాలు సాధించిన సింధు దేశవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకున్నారు.

మొత్తంగా చూస్తే.. MOTN సర్వేలో విరాట్ కోహ్లీ నంబర్‌ వన్ ఇండియన్ మేల్ క్రికెటర్‌గా నిలవడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే సమయంలో స్మృతి మంధాన, నీరజ్ చోప్రా, పీవీ సింధు అగ్రస్థానాల్లో నిలవడం భారత క్రీడారంగంలోని ప్రముఖ తారలకు ఉన్న ప్రజాదరణను మరోసారి తెలియజేస్తోంది.

Also Read: MS Dhoni: ‘హుక్కా తాగి వస్తా’.. ధోనీ కామెంట్స్ వైరల్.. పంత్ రిప్లై కూడా!