Colgate: భారీగా పెరగనున్న కోల్గేట్ ధర..!

Colgate may get costlier as input inflation returns

Colgate: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ముడిసరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్గేట్-పామోలివ్ ఇండియా(Colgate-Palmolive India) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న ఖర్చుల కారణంగా లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు రాబోయే త్రైమాసికంలో కొన్ని ఉత్పత్తుల ధరలను మరింత పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం.

అయితే ధరల పెంపు వల్ల సాధారణ వినియోగదారులపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కంపెనీ చెబుతోంది. Times of India నివేదిక ప్రకారం.. గత ఏడాది GST తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు చిన్న ప్యాకెట్లలో పరిమాణాన్ని పెంచినట్లు కోల్గేట్-పామోలివ్ ఇండియా CEO, MD ప్రభ నరసింహన్ తెలిపారు. రూ.10, రూ.20 ప్యాకెట్లలో ఆ అదనపు పరిమాణాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Nayanthara: నయనతార గుండు చేయించుకున్నారా? వైరల్ ఫొటోల వెనుక అసలు నిజం ఇదే!

ఇటీవల కంపెనీ స్వల్ప స్థాయిలో ధరలను పెంచినప్పటికీ.. సామాన్య వినియోగదారులకు సాధ్యమైనంత వరకు భారం తగ్గించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ప్రభ నరసింహన్ పేర్కొన్నారు. అయితే ముడిసరుకుల ధరలు ఇంకా పెరిగితే.. భవిష్యత్తులో ధరల పెంపు తప్పనిసరి కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Colgate, Tide maker P&G rejig price tactics to keep cash-strapped shoppers,  ETRetail

మరోవైపు కంపెనీ ప్రీమియం ఉత్పత్తులపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్ విభాగాల్లో ఎక్కువ ధర ఉన్న ప్రీమియం ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ భావిస్తోంది. మార్కెట్‌లో హిందూస్థాన్ యూనీలివర్‌కు చెందిన పెప్సోడెంట్, క్లోజప్, హేలియాన్‌కు చెందిన సెన్సోడైన్, పతంజలి వంటి బ్రాండ్ల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. కోల్గేట్ తన ప్రధాన బ్రాండ్లను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.

Also Read: Death Penalty: ఉరిశిక్షకు ఇక బ్రేక్.? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే!

అమ్మకాల పరిమాణాన్ని పెంచేందుకు ప్యాకేజింగ్, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపైనా కంపెనీ దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తుల లభ్యత పెరగడం, ప్రజల ఆదాయాలు పెరగడం, నోటి ఆరోగ్యంపై అవగాహన ఎక్కువ కావడం వల్ల అక్కడ అమ్మకాలు మెరుగుపడుతున్నట్లు కంపెనీ తెలిపింది.

అయితే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే గ్రామీణ డిమాండ్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపై కంపెనీ స్పష్టమైన అంచనా ఇవ్వలేదు. మరోవైపు కోల్గేట్‌కు చెందిన పామోలివ్ పర్సనల్ కేర్ బ్రాండ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని ప్రభ నరసింహన్ అంగీకరించారు.

Also Read: Death Penalty: ఉరిశిక్షకు ఇక బ్రేక్.? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే!