YouTube Monetization: క్రియేటర్లకు షాక్.. ఇకపై 8వేల వాచ్ అవర్స్ తప్పనిసరి!

YouTube Monetization rules changed by Youtube

YouTube Monetization: యూట్యూబ్‌లో కంటెంట్‌ ద్వారా డబ్బు సంపాదించాలనుకునే కొత్త క్రియేటర్లకు ప్లాట్‌ఫామ్ పెద్ద షాకిచ్చింది. యూట్యూబ్ మానిటైజేషన్(YouTube Monetization) రూల్స్ మారనున్నాయి. అంటే ఇకపై యాడ్స్(ads), సబ్‌స్క్రిప్షన్ల(Subscription) ద్వారా ఆదాయం పొందేందుకు గతంతో పోలిస్తే ఎక్కువ అర్హతలు సాధించాల్సి ఉంటుందని యూట్యూబ్ ప్రకటించింది. ఈ మార్పులు ముఖ్యంగా కొత్తగా యూట్యూబ్‌(YouTube)లోకి వస్తున్న క్రియేటర్లు, షార్ట్స్ కంటెంట్‌ చేసే వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌ ద్వారా మానిటైజేషన్ పొందాలంటే క్రియేటర్లకు 1,000 మంది సబ్‌స్క్రైబర్లు(Subscribers), గత 12 నెలల్లో 4,000 గంటల క్వాలిఫైడ్ వాచ్ టైమ్(Watch time) లేదా గత 90 రోజుల్లో 10 మిలియన్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ అవసరం. అయితే కొత్తగా ప్రకటించిన నిబంధనల ప్రకారం ఈ పరిమితులను పెంచుతున్నట్లు యూట్యూబ్ తెలిపింది.

కొత్త అర్హతల ప్రకారం క్రియేటర్లు గత సంవత్సరంలో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పటికే యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో ఉన్న క్రియేటర్లపై ఈ మార్పుల ప్రభావం ఉండదని తెలిపింది.

YouTube Just DOUBLED the Watch Hour Requirement (Here's What To Do)

షార్ట్స్ క్రియేటర్లకు కీలక నిబంధన

షార్ట్స్ ద్వారా ఆదాయం పొందుతున్న క్రియేటర్లకు కూడా యూట్యూబ్ కొత్త నిబంధనను ప్రకటించింది. షార్ట్స్ క్రియేటర్స్ పూల్ ద్వారా డబ్బు సంపాదించాలంటే 90 రోజుల వ్యవధిలో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ కొనసాగించాల్సి ఉంటుంది.

ఒక ఛానల్ ఈ వ్యూస్ పరిమితిని చేరుకోకపోయినా వెంటనే పార్టనర్ ప్రోగ్రామ్ నుంచి తొలగించబడదు. అలాంటి ఛానళ్లు ప్రోగ్రామ్‌లో కొనసాగుతూ లాంగ్‌ఫార్మ్ వీడియోల ద్వారా ఆదాయం పొందవచ్చు. తిరిగి 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధించిన తర్వాత షార్ట్స్ ఆదాయం పునఃప్రారంభమవుతుంది.

Post from vidIQ - YouTube

క్రియేటర్లపై పెరగనున్న ఒత్తిడి

యూట్యూబ్‌లో ప్రతిరోజూ భారీ స్థాయిలో షార్ట్స్ వ్యూస్ వస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చినట్లు సంస్థ చెబుతోంది. అయితే కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ చేరుకోవడం మరింత కష్టంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్స్‌పై ఆధారపడే చిన్న క్రియేటర్లు నిరంతరం ఎక్కువ వ్యూస్ సాధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అదే సమయంలో యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను విస్తరించనున్నట్లు కూడా ప్రకటించింది. ప్రీమియం వినియోగదారుల వీక్షణ సమయం ఆధారంగా క్రియేటర్లకు సబ్‌స్క్రిప్షన్ ఆదాయంలో వాటా లభిస్తుంది. లాంగ్‌ఫార్మ్ వీడియో క్రియేటర్లకు 55 శాతం, షార్ట్స్ క్రియేటర్లకు 45 శాతం కేటాయిస్తామని సంస్థ తెలిపింది.

ఫైనల్ గా చెప్పాలంటే.. యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పులతో కొత్త క్రియేటర్లు మానిటైజేషన్ సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కంటెంట్ నాణ్యతతో పాటు స్థిరంగా ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఇప్పుడు మరింత కీలకంగా మారనుంది.

Also Read: Shocking Twist: 17ఏళ్ల బాలికకు గర్భం.. పెళ్లికి నో చెప్పిన బాలుడి కుటుంబం