Itchy Palms: అరచేతుల్లో దురద.. అలెర్జీనా? లేక ఆరోగ్య సమస్యా?

Itchy Palms: Causes, Symptoms & When to See a Doctor

Itchy Palms: పని చేస్తుండగానే సడన్ గా అరచేతులు దురద(Itchy Palms) పెడుతున్నాయా? చాలామంది “ఏదో పడిందిలే” అని లైట్ తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ చిన్న దురద వెనక పెద్ద కారణం కూడా ఉండొచ్చు. ఎప్పుడు టెన్షన్ పడాలి, ఎప్పుడు లైట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. చేతులు మరీ ఎక్కువగా కడుగుతున్నారా?

ఇది 90% మందిలో ఉండే కారణం. రోజంతా సబ్బులు, శానిటైజర్లు, డిటర్జెంట్ పౌడర్లు వాడితే చేతుల్లోని సహజమైన ఆయిల్ పోతుంది. దాంతో చర్మం పొడిబారి, పొట్టు లేచి దురద వస్తుంది. చలికాలంలో ఇది మరీ ఎక్కువ.

2. సబ్బు లేదా ఉంగరం పడటం లేదా?

కొందరికి కొత్త సబ్బు, కొత్త క్రీమ్, లేదా చేతికి పెట్టుకున్న ఉంగరం, గ్లోవ్స్ పడవు. దీన్నే అలెర్జీ అంటారు. చేతులు ఎర్రగా అయ్యి, చిన్న చిన్న బొబ్బలు వచ్చి విపరీతంగా దురద పెడితే అది అలెర్జీనే.

Causes of itchy palms | Vinmec

3. ఎగ్జిమా సమస్య

చిన్నప్పటి నుంచి చర్మం పొడిబారి, పగిలిపోతుంటే అది ఎగ్జిమా కావచ్చు. ఇది ఉంటే చేతులు ఎప్పుడూ గరుకుగా అనిపించి, దురద పెడుతూనే ఉంటుంది.

4. షుగర్ ఉందా?

చాలామందికి తెలియని విషయం ఇది. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా చర్మం బాగా పొడిబారి దురద వస్తుంది. దురదతో పాటు బాగా దాహం వేయడం, మాటిమాటికీ యూరిన్ రావడం, నీరసంగా అనిపిస్తే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి.

Palm Rash: 8 Common Causes and Treatment Options

5. లివర్, కిడ్నీ ప్రాబ్లమా?

చాలా అరుదుగా, లివర్ లేదా కిడ్నీలో సమస్య ఉన్నా ఒళ్లు దురద పెడుతుంది. కానీ దీనితో పాటు కళ్ళు పచ్చగా అవ్వడం, కాళ్ళ వాపులు లాంటివి కూడా ఉంటాయి.

ఇంట్లోనే తగ్గాలంటే ఏం చేయాలి?

* పని అయ్యాక వెంటనే మంచి మాయిశ్చరైజర్ రాయండి. కొబ్బరి నూనె అయినా పర్లేదు.

* బట్టలు ఉతికేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు గ్లౌజులు వేసుకోండి.

* కారం, ఉప్పు ఎక్కువగా ఉన్న సబ్బులు వాడకండి.

* నీళ్లు బాగా తాగండి.

* గోక్కోవాలని అనిపించినా గోర్లతో గీరకండి, ఇంకా ఎక్కువ అవుతుంది.

ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలి?

దురద 2 వారాల కంటే ఎక్కువ ఉంటే, చేతుల నుండి రక్తం వస్తుంటే, చీము బొబ్బలు వస్తుంటే మాత్రం సొంతంగా క్రీములు రాయకుండా వెంటనే స్కిన్ డాక్టర్ ని కలవండి.

*గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే, డాక్టర్ సలహాకు ప్రత్యామ్నాయం కాదు.*

Also Read: Lizard Dreams: కలలో బల్లి వస్తే ఏమవుతుంది? కీడుకు సంకేతమా?