Breakup: బ్రేకప్‌.. మిమ్మల్ని వదిలివెళ్లిన వారిని మర్చిపోలేకపోతున్నారా..?

How to Move On After a Breakup, According to Psychology

How to Move On After a Breakup, According to Psychology

Breakup: ప్రస్తుతం ప్రేమలో పడటం, కొద్ది కాలానికే విడిపోవడం యువతలో సాధారణంగా మారింది. కొన్ని జంటలు పెళ్లి వరకు వెళ్లినా, తరువాత వివిధ కారణాల వల్ల విడాకుల వరకు వెళ్లడం కూడా పెరుగుతోంది.

ఒక రిలేషన్‌షిప్‌లో ప్రేమ, అంచనాలు, అవసరాలు అనే మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. వీటిలో ఏదైనా ఒకటి తగ్గినా ఆ బంధం బలహీనపడుతుంది. ముఖ్యంగా ఎంతో ప్రేమించిన వ్యక్తి అకస్మాత్తుగా దూరమైతే, ఆ బాధ మనసును తీవ్రంగా కుంగదీస్తుంది.

ఎవరైనా ఒకరితో సంవత్సరాల పాటు బంధం కొనసాగించిన తర్వాత, ఒక్కసారిగా విడిపోవాల్సి వస్తే బాధపడటం సహజం. కొందరి వివాహాలు సజావుగా సాగుతాయి, కానీ మరికొన్ని ఆగ్రహం, అసంతృప్తి వంటి కారణాల వల్ల విఫలమవుతాయి. అలాంటి పరిస్థితులు వ్యక్తి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ప్రేమైనా, పెళ్లైనా జీవితంలో మంచి, చెడు సమయాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బంధం విరిగిపోవచ్చు. అప్పుడు ఒంటరితనం, బాధ ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో పాత జ్ఞాపకాలు మనసును కలవరపెడతాయి. కాబట్టి బ్రేకప్ తర్వాత ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవడం చాలా అవసరం.

ముందుగా, మీ మాజీ భాగస్వామిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం మంచిది. వారిని పదే పదే చూడటం, ఫాలో అవ్వడం వల్ల పాత జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తాయి. అందుకే కొంత దూరం పాటించడం అవసరం.

మనస్తత్వవేత్తల సూచనల ప్రకారం, బ్రేకప్ లేదా విడాకుల తర్వాత కూడా మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. ఆ సమయంలో మన ఆరోగ్యం, భావోద్వేగాలను జాగ్రత్తగా చూసుకోవాలి.

అలాగే, రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ పొరపాట్లు చేయడం సహజమే. గతాన్ని వదిలి, మీ మాజీ భాగస్వామి చేసిన తప్పులను క్షమించగలిగితే మనసుకు శాంతి లభిస్తుంది.

ముఖ్యంగా, మీరు ఆ వ్యక్తితో కలిసి జీవించలేరని భావిస్తే, ఆ నిజాన్ని అంగీకరించి ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రపంచంలో చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాబట్టి దాన్ని సహజంగా స్వీకరించడం నేర్చుకోవడం అవసరం.

Also Read: Wedding Tips: పెళ్లికి ముందు.. వధూవరులు ఈ తప్పులు అస్సలు చేయొద్దు…!

Breakup: బ్రేకప్‌.. మిమ్మల్ని వదిలివెళ్లిన వారిని మర్చిపోలేకపోతున్నారా..?