B Tech Course: 2026లో ఈ బీటెక్ కోర్సులకు ఫుల్ డిమాండ్… ఫ్రెషర్స్‌కే రూ.12 లక్షల సాలరీ

Top High-Paying B.Tech Courses in 2026 for Tech Careers

Top High-Paying B.Tech Courses in 2026 for Tech Careers

B Tech Course: ఇటీవలి మార్కెట్ ట్రెండ్స్ చూస్తే ఇంజనీరింగ్‌పై క్రేజ్ మళ్లీ పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. AI, ఆటోమేషన్ ప్రభావంతో ఇంజనీరింగ్ రంగం వేగంగా మారుతోంది. ముఖ్యంగా AI ఆధారిత టూల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న బీటెక్ విద్యార్థులకు ఇతరులతో పోలిస్తే దాదాపు 40% ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

గత కొన్ని సంవత్సరాల్లో బీటెక్ గ్రాడ్యుయేట్స్‌లో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే డిజిటల్ యుగం రావడంతో కంప్యూటర్ సైన్స్ (CS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చదివిన వారికి కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. ఇప్పుడు కంపెనీలు కేవలం డిగ్రీకే పరిమితం కాకుండా, AI, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్న వారిని ప్రాధాన్యంగా తీసుకుంటున్నాయి.

ప్రస్తుతం ఇంజనీరింగ్ ఉద్యోగ మార్కెట్‌లో “హైబ్రిడ్ స్కిల్స్”కు భారీ డిమాండ్ ఉంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు, డేటా మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో కూడా పరిజ్ఞానం అవసరం. గ్లోబల్ కంపెనీలు భారత్‌ను తమ డిజిటల్ హబ్‌గా మార్చుకుంటుండటంతో బీటెక్ గ్రాడ్యుయేట్స్‌కు అవకాశాలు మరింత పెరుగుతున్నాయి.

2026 నాటికి భారీగా ఉద్యోగాలు వస్తాయని చెప్పలేకపోయినా, సరైన బ్రాంచ్ ఎంచుకుంటే మంచి జాబ్, మంచి సాలరీ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్ వంటి టెక్నాలజీలు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. స్టార్టప్స్ నుంచి పెద్ద MNCల వరకు తమ డిజిటల్ వ్యవస్థలను నిర్వహించేందుకు నైపుణ్యం ఉన్న ఇంజనీర్లను వెతుకుతున్నాయి.

AI ఫస్ట్ ఇంజనీర్లకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో సాలరీ ప్యాకేజీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్రెషర్ ఇంజనీర్ల సగటు వేతనం 15-20% వరకు పెరిగింది. ముందు రూ. 4-5 లక్షల ప్యాకేజీ ఉండగా, ఇప్పుడు స్కిల్స్ ఉన్న వారికి రూ. 8-12 లక్షల వరకు ఆఫర్లు వస్తున్నాయి.

డిజిటల్ ప్రభావం IT రంగంతో పాటు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లపై కూడా పడుతోంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు EV (ఎలక్ట్రిక్ వాహనాలు) రంగంలో మంచి డిమాండ్ ఉంది. మెకానికల్ ఇంజనీర్లు రోబోటిక్స్, 3D ప్రింటింగ్ రంగాల్లో అవకాశాలు పొందుతున్నారు. స్మార్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ కారణంగా కోర్ ఇంజనీరింగ్ మళ్లీ ప్రాధాన్యం పొందుతోంది.

ఇక నియామకాల్లో కూడా మార్పులు వచ్చాయి. కంపెనీలు కాలేజ్ పేరుకంటే, అభ్యర్థి స్కిల్స్‌ను ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. కోడింగ్ కాంపిటిషన్స్, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ వంటి అనుభవాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో టియర్-3 కాలేజీల విద్యార్థులు కూడా టియర్-1 విద్యార్థులతో సమానంగా పోటీ పడుతున్నారు.

Also Read: 10 Years of UPI: టీ కొట్టు నుంచి మాల్స్ వరకు.. ‘UPI’కి పదేళ్లు!

B Tech Course: 2026లో ఈ బీటెక్ కోర్సులకు ఫుల్ డిమాండ్… ఫ్రెషర్స్‌కే రూ.12 లక్షల సాలరీ