Vaazha 2: చిన్న సినిమా రూ.100 కోట్లు కొల్లగొట్టింది!

Vaazha 2 Grosses Rs. 100 Crore in 7 Days, Equals Lokah’s Historic Record

Vaazha 2 Grosses Rs. 100 Crore in 7 Days, Equals Lokah’s Historic Record

Vaazha 2: మలయాళంలో న్యూఏజ్ కామెడీగా తెరకెక్కిన ‘వజా 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్’ సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తోంది. విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతూ రికార్డు సృష్టించింది. కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా, స్టార్ హీరోల చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా వసూళ్లు సాధించడం విశేషం.

ఈ చిత్రాన్ని సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11 కోట్లుగా నిర్ణయించారు. అయితే విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆ టార్గెట్‌ను దాటేసి భారీ లాభాలను అందిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

రోజువారీ వసూళ్ల విషయానికి వస్తే, తొలి రోజు రూ.4.75 కోట్లు, రెండో రోజు రూ.5.25 కోట్లు, మూడో రోజు రూ.7 కోట్లు, నాలుగో రోజు రూ.8.55 కోట్లు, ఐదో రోజు రూ.7.10 కోట్లు, ఆరో రోజు రూ.7.10 కోట్లు, ఏడో రోజు రూ.6.95 కోట్లు వసూలు చేసింది. ఇలా మొదటి 7 రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో రూ.47 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించింది.

ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి స్పందన పొందుతోంది. మిడిల్ ఈస్ట్‌లో 3 మిలియన్ డాలర్లు, యూకేలో 350K డాలర్లు, నార్త్ అమెరికాలో 400K డాలర్లు, ఆస్ట్రేలియాలో 100K డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం. మొత్తంగా విదేశాల్లో సుమారు రూ.49 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఇండియాలో రూ.47 కోట్ల నెట్, రూ.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పాటు ఓవర్సీస్ వసూళ్లు కలిపి మొత్తం రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. యూత్‌ఫుల్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా పోటీ ఇస్తూ ముందుకు సాగుతోంది.

ఈ సినిమాలో హషిర్, అలన్ బిన్, అజిన్, దేవరాజ్, విజయ్ బాబు, బిజుకుట్టన్, అజు వర్గీస్, అల్ఫోన్సే పుత్రెన్ వంటి నటులు నటించారు. విపిన్ దాస్‌తో పాటు హారీస్ దేసోమ్, సాహు గారపాటి, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫీ అందించగా, కన్నన్ మోహన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

డబ్ల్యూబీటీఎస్ ప్రొడక్షన్స్, ఇమాజిన్ సినిమాస్, షైన్ స్క్రీన్స్, సిగ్నేచర్ స్టూడియోస్, ఐకాన్ స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో నాణ్యమైన కంటెంట్ అందించిందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ‘లూసిఫర్’, ‘ఎంపురాన్’, ‘మార్కో’ వంటి పెద్ద సినిమాలతో పాటు ‘మంజుమ్మేల్ బాయ్స్’, ‘ప్రేమలు’ వంటి చిన్న సినిమాల సరసన నిలుస్తూ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు అందిస్తోంది.

Also Read: Samantha: రాజ్ లేకుండా ఒక్క రోజూ ఉండలేను.. సమంత ఎమోషనల్

Vaazha 2: చిన్న సినిమా రూ.100 కోట్లు కొల్లగొట్టింది!