Petrol: లీటర్‌ పెట్రోల్‌ ధర కేవలం రూ.3 మాత్రమే.. ఎక్కడంటే?

Unbelievable! 40 litres of petrol in this country costs less than your morning kachori in India

Unbelievable! 40 litres of petrol in this country costs less than your morning kachori in India

Petrol: ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. దీనివల్ల చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. భారత్‌లో కూడా సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పక్కనే ఉన్న పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అక్కడ ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.520.35కి చేరగా, పెట్రోల్ ధర రూ.458.40 వరకు పెరిగింది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలపై భారమైంది. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరగడంతో పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.

ఇక యూరప్ దేశాల్లో కూడా పెట్రోల్ ధరలు దేశానికొకలా ఉన్నాయి. డెన్మార్క్‌లో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.247 వరకు ఉండగా, సింగపూర్‌లో రూ.236, జర్మనీలో రూ.225 ప్రాంతంలో ఉంది. ఈ సంఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఎంత పెరిగాయో చూపిస్తున్నాయి.

అయితే ఈ పరిస్థితుల మధ్య కూడా కొన్ని దేశాల్లో పెట్రోల్ చాలా చౌకగా లభిస్తోంది. అందులో ముఖ్యంగా ఇరాన్ ముందంజలో ఉంది. అక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం $0.029 మాత్రమే, అంటే మన కరెన్సీలో సుమారు రూ.2.7. ఇరాన్‌లో పెట్రోల్ భారీ స్థాయిలో ఉత్పత్తి కావడం వల్లే ఈ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇక వెనిజులాలో కూడా పెట్రోల్ ధర చాలా తక్కువగానే ఉంటుంది. అక్కడ ఒక లీటర్ పెట్రోల్ సుమారు $0.035, అంటే దాదాపు రూ.2.7కే లభిస్తోంది.

మొత్తంగా చూస్తే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, మరికొన్ని దేశాల్లో మాత్రం స్థానిక ఉత్పత్తి కారణంగా పెట్రోల్ అత్యంత చౌకగా అందుబాటులో ఉంది.

Also Read: Post Office RD: ఇలా చేస్తే.. ఎవ్వరైనా ఈజీగా లక్షాధికారి అవ్వొచ్చు
Petrol: లీటర్‌ పెట్రోల్‌ ధర కేవలం రూ.3 మాత్రమే.. ఎక్కడంటే?