Trisha: త్రిష కృష్ణన్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా, హీరోయిన్గా మారిన తర్వాత ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించింది. ఆమె స్థాయిని చూసి చాలామంది కథానాయికలు అసూయ పడేవారని చెప్పడం అతిశయోక్తి కాదు.
కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఒక వీడియో లీక్ కావడంతో, త్రిష ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వివాదాన్ని ఆమె పట్టించుకోకుండా ధైర్యంగా ఎదుర్కొని, తన కెరీర్‌ను మరింత బలంగా నిలబెట్టుకుంది. వృత్తిపరంగా మాత్రమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులను ఆమె ఎదుర్కొంది.
ఇటీవల నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీ స్థాపించిన తర్వాత, త్రిష–విజయ్ సంబంధంపై రూమర్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీసి, చివరకు ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అదే సమయంలో విజయ్ భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుందనే వార్తలతో ఈ రూమర్స్ మరింత పెరిగాయి.
ఇప్పుడేమో త్రిష నటనకు స్వస్తి చెప్పబోతుందనే వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే ఆమె కెరీర్‌ను చాలామంది ఎప్పటికప్పుడు ఎగిసిపడే అలలతో పోలుస్తుంటారు. అవకాశాలు తగ్గిపోయాయని అనుకున్న ప్రతిసారి త్రిష మళ్లీ బలంగా తిరిగి వచ్చి తన సత్తా చాటుకుంది. అయితే గత సంవత్సరం ఆమెకు పెద్దగా విజయాలు రాలేదు.
అజిత్‌తో ‘విడముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’ వంటి చిత్రాల్లో ఆమె నటించింది. తెలుగులో ‘విశ్వంభర’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయినప్పటికీ, కొత్త అవకాశాలు వచ్చినా త్రిష వాటిని సున్నితంగా తిరస్కరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం, తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కడం వంటి కారణాలతో ఆమె రాజకీయాల్లోకి వెళ్లవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తమిళ సీనియర్ నటుడు, జర్నలిస్ట్ చిత్ర లక్ష్మణన్ కూడా త్రిష విజయ్ పార్టీకి చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. ఆయన చెప్పిన విషయాల్లో కొంత నిజం ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక మరోవైపు, విజయ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే త్రిష అతనికి మద్దతుగా రాజకీయాల్లోకి వెళ్లవచ్చని, లేకపోతే మళ్లీ సినిమాల్లో కొనసాగుతుందని కూడా కొందరు అంటున్నారు.
అయితే ఈ అన్ని రూమర్స్‌ను త్రిష కొట్టిపారేసింది. తనపై వస్తున్న వార్తలను వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ, “ఇవాళ్టి కోట ఇదే” అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి స్పందించింది.

Also Read: Iran: కోమాలో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ..?
Trisha: నటనకు త్రిష గుడ్ బై..!
