Plastic Plate: పేపర్ ప్లేట్స్‌లో భోజనం చేస్తున్నారా?

A video from vikrant singh thakur about paper plates

A video from vikrant singh thakur about paper plates

Plastic Plate: టిఫిన్ సెంటర్లు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో విస్తృతంగా ఉపయోగించే పేపర్ ప్లేట్లపై ఓ డాక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, పేపర్ ప్లేట్లలో భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తూ వాటిని “క్యాన్సర్ ప్లేట్లు”గా పేర్కొన్నారు.

సాధారణంగా ఈ పేపర్ ప్లేట్లపై ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. వేడి ఆహారం వడ్డించినప్పుడు ఆ ప్లాస్టిక్ కరుగుతూ మైక్రోప్లాస్టిక్స్, పాలిమర్ రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. ఇవి శరీరంలోకి వెళ్లడం వల్ల క్యాన్సర్, హార్మోన్ అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు రావచ్చని తెలిపారు.

అంతేకాదు, ఉపయోగించిన పేపర్ ప్లేట్లను బయట పడేయడం వల్ల పశువులు వాటిని తిని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. వాటిని కాల్చితే గాలిలో హానికర పదార్థాలు కలసి వాయు కాలుష్యాన్ని పెంచుతాయని కూడా హెచ్చరించారు.

కాబట్టి పేపర్ ప్లేట్లకు బదులుగా చెరకు తాటి, వెదురు వంటి సహజ పదార్థాలతో తయారైన ప్లేట్లు ఉపయోగించడం మంచిదని సూచించారు. అలాగే పెళ్లిళ్లు, వేడుకలు నిర్వహించే వారు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని చెప్పారు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం మన ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా హానికరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Fridge Murder: ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు

Plastic Plate: పేపర్ ప్లేట్స్‌లో భోజనం చేస్తున్నారా?