Petrol Prices: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. భారులు తీరిన జనం

Fuel shortage fears grip Hyderabad; demand spills over into March 24 night

Fuel shortage fears grip Hyderabad; demand spills over into March 24 night

Petrol Prices: ప్రపంచంలోని చాలా దేశాలు తమ చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి చమురు సరఫరా దెబ్బతింది. దీంతో భారత్‌తో పాటు అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత పరిస్థితి ఏర్పడింది.

దిగుమతులు తగ్గిపోవడంతో ఇంధనానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంధనం అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యేకంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అంబర్‌పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల ముందు ఆటోలు, వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రస్తుత పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి.

Also Read: No Rains: ఈ ఊర్లో వర్షమే కురవదు!

Petrol Prices: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. భారులు తీరిన జనం