Petrol Price: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల మధ్య, ఇప్పటికే ఆర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా కోలుకోని శ్రీలంకలో ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడింది.
శ్రీలంక ప్రభుత్వం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలను అమల్లోకి తీసుకువచ్చింది. తాజా పెంపుతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర లీటరుకు రూ.81 పెరిగి రూ.398కు చేరుకుంది. ఆక్టేన్ 95 పెట్రోల్ ధర రూ.90 పెరిగి లీటరుకు రూ.455గా నమోదైంది.
డీజిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఆటో డీజిల్ లీటరు రూ.79 పెరిగి రూ.382కు చేరగా, సూపర్ డీజిల్ ధర రూ.90 పెరిగి లీటరుకు రూ.443కు చేరింది. కిరోసిన్ ధర కూడా రూ.60 పెరిగి లీటరుకు రూ.255గా మారింది.
ఇంధన ధరల ఈ పెరుగుదలతో రవాణా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం రోజువారీ అవసరాల ధరలపై పడే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలకు ఈ నిర్ణయం మరింత భారంగా మారింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Shigellosis: దేశంలోకి కొత్త వ్యాధి.. చిన్నారి మృతి!
Petrol Price: మొన్నటిదాకా గ్యాస్ సిలిండర్.. ఇప్పుడు పెట్రోల్
