Gold Rates: 10 గ్రాముల బంగారం ధర లక్షలోపే…!

Will Gold Prices Decline in the Coming Days in India?

Will Gold Prices Decline in the Coming Days in India?

Gold Rates: గత ఏడాది నుంచి బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేల స్థాయి నుంచి ప్రారంభమై క్రమంగా ఎగబాకుతూ ఈ ఏడాది జనవరిలో ఆల్‌టైమ్ హైకు చేరింది. 2026 జనవరిలో భారత మార్కెట్‌లో 10 గ్రాముల ధర రూ.1,80,779 వరకు పెరిగి రికార్డు సృష్టించింది. దీంతో బంగారం త్వరలోనే రూ.2 లక్షలకు చేరుతుందేమో అన్న ఆందోళన కూడా వినిపించింది. సామాన్యులకు బంగారం కొనడం కష్టమవుతుందనే చర్చలు జరిగాయి.

అయితే జనవరి తర్వాత పరిస్థితి కొంత మారింది. ఫిబ్రవరి నాటికి బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 10 గ్రాముల ధర సుమారు రూ.1,56,200 వద్ద ఉంది. అంటే గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 13.5 శాతం వరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా స్పాట్ గోల్డ్ ధర జనవరిలో ఔన్సుకు 5,626 డాలర్ల వరకు వెళ్లగా, ఇప్పుడు సుమారు 5,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈ మార్పులపై ప్రముఖ ఆర్థికవేత్త, పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 2027 చివరి నాటికి కామెక్స్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 3,000 డాలర్ల స్థాయికి పడిపోవచ్చని చెప్పారు. అదే జరిగితే భారత మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.90,000 నుంచి రూ.1,00,000 మధ్య స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషించారు.

బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా BRICS దేశాలు అమెరికా డాలర్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలు పెంచుకున్నాయి. కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోలు చేయడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయని భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు పరిస్థితి మారవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా మళ్లీ అమెరికా డాలర్లలో వాణిజ్య సెటిల్‌మెంట్లు చేపట్టే అవకాశంపై వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే BRICS దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది. దాంతో మార్కెట్‌లో డిమాండ్ తగ్గి ధరలు కూడా పడిపోవచ్చని అమిత్ గోయల్ అభిప్రాయపడ్డారు. ఈ నివేదికలను రష్యా ఇప్పటివరకు ఖండించకపోవడం వల్ల మార్కెట్‌లో అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Also Read: Plane: విమానంలో ఇలా పాటలు వింటే అంతే..

Gold Rates: 10 గ్రాముల బంగారం ధర లక్షలోపే…!