Skip to content
Tuesday, Oct 20, 2026
  • Home
  • Telugu States
  • National
  • Cinema
  • Business
  • Tech
  • Jobs
  • Life Style
  • Gallery
Telugupost | Telugu Latest News

Telugupost | Telugu Latest News

Advertisment Image
Business

Zero Balance: అకౌంట్‌లో ఒక్క రూపాయి లేకున్నా.. విత్‌డ్రా చేయొచ్చు.. ఎలాగంటే?

adminMarch 16 3:23 pmMarch 16 3:25 pm
Zero balance in your bank account? You can still withdraw money

Zero balance in your bank account? You can still withdraw money

Zero Balance: అత్యవసర సమయంలో డబ్బులు అవసరం అయితే… కానీ బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ జీరోగా ఉంటే చాలామంది టెన్షన్ పడతారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బ్యాంకులు అందిస్తున్న ఒక ప్రత్యేక సౌకర్యంతో అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా నగదు తీసుకునే అవకాశం ఉంది.

ఈ సౌకర్యాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ (Overdraft – OD) అని అంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్ లోన్‌లాంటిదే. ప్రస్తుతం చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. సాధారణంగా శాలరీ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వంటి ఖాతాలపై ఈ సౌకర్యం లభిస్తుంది. కొన్ని బ్యాంకులు బాండ్లు, LIC పాలసీలు, షేర్లు, గోల్డ్ వంటి వాటిపై కూడా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఇస్తాయి.

సాధారణంగా మన అకౌంట్‌లో ఉన్నంత డబ్బు మాత్రమే తీసుకోవచ్చు. కానీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం ఉంటే బ్యాంక్ అనుమతించిన పరిమితి వరకు అదనంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఆ మొత్తాన్ని వడ్డీతో కలిసి నిర్దిష్ట గడువులో తిరిగి చెల్లించాలి.

ఈ సౌకర్యాన్ని పొందాలంటే ముందుగా బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. ఓవర్‌డ్రాఫ్ట్ కోసం దరఖాస్తు కూడా చేయాలి. ఇది సాధారణ లోన్‌కు అప్లై చేసే విధానంతోనే ఉంటుంది. బ్యాంక్ నిబంధనలు, పరిమితులు, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో ముందుగా తెలుసుకోవడం మంచిది.

అయితే ఈ సదుపాయాన్ని అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి. గడువులోగా డబ్బు తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు ఎక్కువ వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం పడవచ్చు.

కాబట్టి ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది.

Also Read: Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఎన్ని కిటికీలు, తలుపులు ఉండాలంటే..

Zero Balance: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు లేకున్నా.. విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎలాగంటే?

Tagged bank account, bank account overdraft facility, bank savings account, overdraft facility, overdraft facility account, withdraw money from zero balance account, withdraw money with bank balance zero, zero baalnce savings account, zero balance account, జీరో బ్యాలెన్స్ అకౌంట్

Post navigation

⟵ Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఎన్ని కిటికీలు, తలుపులు ఉండాలంటే..
LPG Cylinder: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కు ఎరుపు రంగే ఎందుకు వేస్తారంటే.. ⟶

Related Posts

Maruti Suzuki Dzire set to become India's largest-selling car in FY26, Tata Nexon leads SUV race
Maruti Suzuki Dzire: టాప్ సెల్లింగ్ కార్‌గా డిజైర్!

Maruti Suzuki Dzire: దేశీయ కార్ల…

Best Mutual Funds with Rs 1000 Monthly SIP
Mutual Funds: నెలకు రూ. 1000 పొదుపుతో రూ. 2.30 కోట్లు

Mutual Funds: పెట్టుబడులు పెట్టడానికి నేటి…

"Domestic Production Up 30%": LPG Panic Booking
LPG Cylinder Sales: గ్యాస్ దొరకదేమోనని.. రోజుకు ఎన్ని బుకింగ్స్ అవుతున్నాయంటే..

LPG Cylinder Sales: దేశంలో వంట…

Latest Posts

  • Gemini Auto Browse: ఇక టైప్ చేయక్కర్లేదు! Chrome లో Gemini మీ బదులు ఫారమ్ లు నింపేస్తుంది
  • Orkut is Coming Back: ఇన్ స్టా, ఫేస్ బుక్ కి గట్టి దెబ్బ – ఆర్కుట్ మళ్లీ వస్తోంది..!
  • Arjun Parmar: 18 వేల జీతంతో మొదలు – 3 ఏళ్లలో 75 లక్షలు – లేఆఫ్ ని కూడా ఓడించిన కుర్రాడి కథ
  • Night Shift: చాలా డేంజర్.. నైట్ షిఫ్టులో పనిచేస్తున్నారా?
  • Raj Reddy Siri Alexa Creator: ఇసుకలో అక్షరాలు రాసిన కుర్రాడు – Siri, Alexa లను కనిపెట్టాడు!
  • Heart Valve Disease: 55 ఏళ్ల తర్వాత ఈ 6 లక్షణాలు ఉంటే.. వెంటనే గుండె చెకప్ చేయించండి
  • Healthy Labels: 8 కంపెనీల బండారం బయటపెట్టిన FSSAI
  • Irumudi Vibe: ఇరుముడి’కి ట్రాక్టర్లలో పోటెత్తారు!
  • US Open Match: గంజాయి స్మెల్.. మ్యాచ్ మధ్యలో ఆపిన టెన్నిస్ స్టార్
  • No 1 Male Cricketer: ఇండియాలో నం.1 క్రికెటర్ ఇతడే..!
Copyright © 2026 Telugupost | Telugu Latest News | Rapid News by Ascendoor | Powered by WordPress.