Mobile: మీరు ఫోన్ ఎలా పట్టుకుంటున్నారు?

Your Phone Holding Style Reveals Your Hidden Personality Traits

Your Phone Holding Style Reveals Your Hidden Personality Traits

Mobile: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయలేని భాగమైంది. అయితే ఎక్కువసేపు తల వంచి ఫోన్ వాడటం శారీరకంగా, మానసికంగా నష్టం కలిగిస్తోంది. సాధారణంగా మన తల బరువు సుమారు 5–6 కిలోలవుంటుంది. కానీ తలను 45 డిగ్రీలు వంచినప్పుడు వెన్నెముకపై 20 కిలోలకుపైగా ఒత్తిడి పడుతుంది. దీని వలన మెడ నొప్పి, భుజాల నొప్పి, వెన్నెముక సమస్యలు వంటి సమస్యలు వస్తాయి. యువతలో ప్రత్యేకంగా ‘టెక్స్ట్ నెక్ సిండ్రోమ్’ వేగంగా పెరుగుతున్నట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి.

తల వంచి కూర్చోవడం వల్ల శరీర భంగిమ (posture) కూడా మారుతుంది. ముందుకు వంగి ఫోన్ చూడటం లేదా లేజీగా కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయవు. ఫలితంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ లోపం మన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, దాంతో డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.

తల వంచిన స్థితిలో ఉన్నప్పుడు, మన మెదడు ఆటోమేటిక్‌గా “సాధారణం కంటే దిగులుగా ఉన్న స్థితి”గా భావించి హార్మోన్ల మార్పులు జరగడం ప్రారంభిస్తుంది. ఈ సమస్యలు నివారించడానికి కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం అవసరం. ఫోన్‌ను ఎల్లప్పుడూ కళ్ల స్థాయిలో ఉంచి చూడటం మంచిది. ప్రతి 20 నిమిషాలకోసారి స్క్రీన్ నుండి దృష్టి తిప్పి, శరీరాన్ని స్ట్రెచ్ చేయడం ద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయి.

వెన్నును నిటారుగా ఉంచి కూర్చోవడం, ఫోన్ వాడకాన్ని తగ్గించడం, బహిరంగ ప్రదేశాల్లో నడవడం, కళ్లకు విశ్రాంతి ఇవ్వడం కూడా మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. టెక్నాలజీ మనకు సహాయకురాలిగా ఉండాలి, శత్రువుగా కాకూడదు. ఈ చిన్న మార్పులు పాటిస్తే మన శరీరం, మనసు రెండూ ఆరోగ్యవంతంగా, సంతోషంగా ఉంటాయి.

Also Read: Instagram: టీనేజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్!

Mobile: మీరు ఫోన్ ఎలా పట్టుకుంటున్నారు?