Fridge Murder: ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు

Visakhapatnam horror: Navy staff kills lover, dismembers body, stores parts in fridge

Visakhapatnam horror: Navy staff kills lover, dismembers body, stores parts in fridge

Fridge Murder: విశాఖపట్నంలోని ఎల్‌వీ నగర్‌లో సభ్య సమాజాన్ని కలచివేసే విధంగా ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. నమ్మిన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్ర (35), తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనిక (29) అనే వివాహితను తన ఫ్లాట్‌కు పిలిచాడు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, చివరకు ఆమెను హత్య చేసే వరకు వెళ్లింది. అనంతరం సాక్ష్యాలను దాచేందుకు మృతదేహాన్ని ముక్కలు చేసి కొంత భాగాన్ని ఫ్రిజ్‌లో, మరికొంతను బయట సంచిలో ఉంచాడు.

హత్య అనంతరం రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేయగా, అక్కడి దృశ్యాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. విచారణలో నిందితుడు, మౌనిక తనను డబ్బుల కోసం తరచూ వేధిస్తోందని, ఆ కోపంతోనే హత్య చేసినట్లు చెప్పినట్టు సమాచారం.

అయితే ఈ కేసులో డబ్బు సమస్యలతో పాటు ఇతర వ్యక్తిగత కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహం తల భాగం ఇంట్లో కనిపించకపోవడంతో, నిందితుడిని ప్రశ్నించగా ధారపాలెం సమీపంలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. అక్కడ గాలింపు జరిపిన పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Also Read: Honey Rose: ఇలా తయ్యారేంట్రా.. హనీ రోజ్ నడుము పట్టుకుని సెల్ఫీలు..!

Fridge Murder: ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు