Telangana: తులం బంగారం స్కీమ్.. వీరు మాత్రమే అర్హులు

Telangana: 'One Tola Gold' Scheme — Only These Individuals Are Eligible

Telangana: 'One Tola Gold' Scheme — Only These Individuals Are Eligible

Telangana: తెలంగాణలో “కల్యాణమస్తు” పథకం అమలుపై ప్రభుత్వం తాజాగా సంకేతాలు ఇచ్చినప్పటికీ, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పూర్తిస్థాయిలో అమలుకాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాల కింద తులం బంగారం, లక్ష రూపాయల నగదు ఇస్తామని హామీ ఇచ్చినా, అది ఇంకా అమలులోకి రాలేదు. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత అని తెలుస్తోంది.

ఇటీవల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే కల్యాణ లక్ష్మి పేరును “కల్యాణమస్తు”గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎప్పుడు నుంచి అమలు అవుతుంది, ఇప్పటికే పెళ్లి అయిన వారికి వర్తిస్తుందా అనే అంశాలపై ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాలేదు.

ప్రస్తుతం వరుసగా పెళ్లి సీజన్లు ముగుస్తున్నా, ఈ పథకం మాత్రం ఇంకా అమలులోకి రాలేదు. అధికారులు ప్రాథమికంగా ఈ పథకానికి సుమారు 1,450 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది.

ఇక ఆరు గ్యారంటీల అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పథకాన్ని త్వరగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఏడాది పెళ్లి అయిన జంటలకు మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశముంది. గత రెండేళ్లలో జరిగిన అన్ని పెళ్లిళ్లకు ఈ పథకాన్ని అమలు చేయడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. అలాగే తెలుపు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు త్వరలోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: Trisha: త్రిషకు ఆల్రెడీ పెళ్లైందా?.. వామ్మో కూడా ఉన్నారా..?

Telangana: తులం బంగారం స్కీమ్.. వీరు మాత్రమే అర్హులు