Vaishnavi: ప్రేమ పెళ్లి, ప్రెగ్నెంట్.. పెళ్లయి ఏడాది కూడా కాలే.. యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య

Man stabs pregnant YouTuber wife to death over dowry

Man stabs pregnant YouTuber wife to death over dowry

Vaishnavi: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల జీవితం ఏడాది కూడా పూర్తికాకముందే విషాదాంతం చెందింది. నూరేళ్లు కలిసి జీవించాలని కలలు కన్నారు కానీ, ఆ కలలు కొద్ది కాలంలోనే చిద్రమయ్యాయి. భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (19) మరియు కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు (26) ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ మాదాపూర్‌లోని అత్తింట్లో నివాసం ఉంటున్నారు. వైష్ణవి యూట్యూబర్‌గా కూడా కొనసాగుతూ ఉండగా, ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా ఉన్నారు.

అయితే గత కొద్దిరోజులుగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వరకట్నం విషయంలో హరిబాబు వైష్ణవిని వేధిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా వారి మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది.

సోమవారం అర్ధరాత్రి తర్వాత వారి గదిలో నుంచి శబ్దాలు వినిపించడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, ఇద్దరూ నిద్రిస్తున్నట్లు భావించి తిరిగి వెళ్లిపోయారు. అయితే మంగళవారం ఉదయం లేచి చూసేసరికి వైష్ణవి రక్తపు మడుగులో పడివున్న దృశ్యం కనిపించింది. అప్పటికే హరిబాబు అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డీఎస్పీ రాములు, సీఐ సురేశ్‌బాబు, ఎస్సై చిరంజీవి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో అర్ధరాత్రి తర్వాత హరిబాబు వైష్ణవి గొంతు నులిమి, అనంతరం చేతులు, నుదిటిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించడంతో పాటు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Cancer: ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్

Vaishnavi: ప్రేమ పెళ్లి, ప్రెగ్నెంట్.. పెళ్లయి ఏడాది కూడా కాలే.. యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య