Crime: పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో దారుణం

Man kills sister over inter-faith relationship in East godavari dist

Man kills sister over inter-faith relationship in East godavari dist

Crime: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో పరువు హత్య..

సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని కొట్టి చంపిన యువతి సోదరులు..

ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో చెల్లెలి భర్తను చంపిన సోదరులు..

రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పని చేస్తున్న అయినవిల్లి సంధ్య..

సూర్య ప్రకాష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్య

ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య ఘటన కలకలం రేపింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహంతో యువతి సోదరులు అతన్ని దారుణంగా హత్య చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకపూడి ప్రాంతంలో చోటుచేసుకుంది.

సూర్యప్రకాష్ మరియు సంధ్య కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే సూర్యప్రకాష్ వేరే కులానికి చెందినవాడని తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ, ఇద్దరూ తమ నిర్ణయంపై నిలబడి గురువారం అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నారు.

ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సంధ్య సోదరులు సూర్యప్రకాష్‌ను హతమార్చాలని పన్నాగం పన్నారు. వేములపల్లి ప్రాంతంలో అతని కోసం దారికాచి, దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంధ్య ప్రస్తుతం రాయవరం మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Also Read: Aditi Myakal: ‘ఫుల్ డ్రెస్ వేసుకున్నా అక్కడ తాకాడు’

Crime: పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో దారుణం