Telangana: మంథని ప్రాంతంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణలో భాగంగా పుట్ట మధుకు CBI హాజరు కావాలని నోటీసులు పంపింది. దీంతో హత్యలో పుట్ట మధు పేరు బయటకు వస్తే, మంథనిలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమవుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కుతోంది.
గత నెల రోజులుగా పెద్దపల్లి ప్రాంతంలో CBI బృందం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్న వారిలో ఎక్కువ మందిని ఇప్పటికే విచారించినట్లు సమాచారం. ఇప్పుడు పుట్ట మధుకు పిలుపు ఇవ్వడంతో కేసు దిశపై మరింత ఆసక్తి పెరిగింది.
