Mobile Charging: మొబైల్ ఫోన్‌ను 100% వరకు ఛార్జ్ చేయడం చాలా మంది సాధారణంగా చేసే అలవాటు. అయితే ఈ అలవాటు మీ ఫోన్ బ్యాటరీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఛార్జింగ్ విధానంలో కొంత జాగ్రత్త అవసరం.
నేటి కాలంలో ఫోన్ లేకుండా జీవితం ఊహించలేం. చాలా మంది ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడే ఉపయోగించడం, వీడియోలు చూడడం, రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టి ఉంచడం వంటి పనులు చేస్తుంటారు. 100% పూర్తయ్యే వరకు ఫోన్‌ను కనెక్ట్ చేసి ఉంచడం కూడా సాధారణమే. కానీ ఇవన్నీ బ్యాటరీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలే.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫోన్ బ్యాటరీని 20% నుంచి 80% మధ్యలోనే ఛార్జ్ చేయడం ఉత్తమం. 100% వరకు ఛార్జ్ చేస్తే ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. ఈ వేడి బ్యాటరీ సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ప్రతి బ్యాటరీకి పరిమిత సంఖ్యలో ఛార్జ్-డిశ్చార్జ్ సైకిల్స్ ఉంటాయి. పూర్తిగా ఛార్జ్ చేయడం వల్ల ఈ సైకిల్స్ వేగంగా పూర్తవుతాయి, దాంతో బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఉంచడం. 100% అయిన తర్వాత కూడా పవర్‌కు కనెక్ట్‌గా ఉండడం వల్ల బ్యాటరీపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీని వల్ల బ్యాటరీ పనితీరు క్షీణించే అవకాశం ఉంది.
అందువల్ల, మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం బాగా పనిచేయాలంటే 100% ఛార్జింగ్ చేసే అలవాటును తగ్గించడం మంచిది. బదులుగా 80% వరకు ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఈ చిన్న మార్పు మీ ఫోన్ బ్యాటరీ జీవితాన్ని గణనీయంగా పెంచుతుంది.
