Artificial Intelligence: ఏఐని ఈ ఐదు విషయాలు అడిగారో.. మీ పని ఔట్!

5 things to avoid asking AI, according to security experts

5 things to avoid asking AI, according to security experts

Artificial Intelligence: కృత్రిమ మేధస్సు (AI) వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. చిన్న విషయాల నుంచి పెద్ద నిర్ణయాల వరకు చాలా మంది ఏఐపై ఆధారపడుతున్నారు. అయితే, ఏఐ చెప్పిన ప్రతి సమాచారం ఖచ్చితమనే కాదు. ఇది ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న సమాచారాన్ని సేకరించి సమాధానం ఇస్తుంది కానీ అన్ని సందర్భాల్లో సరైన నిర్ణయం ఇవ్వలేకపోవచ్చు. అందుకే కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఏఐను ఆశ్రయించకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. కొందరు ఏఐను అడిగి మందులు వాడటం లేదా చికిత్సలు ప్రారంభించడం చేస్తున్నారు. కానీ ఇది ప్రమాదకరం కావచ్చు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిపుణులైన వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

అలాగే న్యాయపరమైన సలహాల విషయంలో కూడా ఏఐపై పూర్తిగా ఆధారపడకూడదు. ప్రతి కేసు పరిస్థితులు వేర్వేరు ఉంటాయి. ఏఐ మీ కేసును పూర్తిగా అర్థం చేసుకుని న్యాయవాది లాగా ఖచ్చితమైన సలహా ఇవ్వలేడు. కాబట్టి న్యాయ విషయాల్లో నిపుణులనే సంప్రదించడం మంచిది.

వ్యక్తిగత విషయాలను కూడా ఏఐతో పంచుకోవడం సరైనది కాదు. మనం ఇచ్చే సమాచారం సిస్టమ్‌లో నిల్వ ఉండే అవకాశం ఉంది. గోప్యత పరిరక్షణ పూర్తిగా ఉండకపోవచ్చు. అందువల్ల వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగత సమస్యలను ఏఐతో షేర్ చేయకుండా ఉండాలి.

మానసిక సమస్యల విషయంలో కూడా ఏఐ సరైన పరిష్కారం ఇవ్వలేకపోవచ్చు. ఒత్తిడి, ఒంటరితనం, ప్రేమ వైఫల్యం వంటి సమస్యలకు నిపుణులైన కౌన్సిలర్ లేదా సైకాలజిస్టులను సంప్రదించడం ఉత్తమం.

ఇక ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ వంటి విషయాల్లో ఏఐ సూచనలు ఇచ్చినా, భవిష్యత్తు ఫలితాలను ఖచ్చితంగా చెప్పలేడు. కాబట్టి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మొత్తానికి, ఏఐ ఒక సహాయక సాధనం మాత్రమే. ముఖ్యమైన నిర్ణయాల్లో దానిపై పూర్తిగా ఆధారపడకుండా, అవసరమైన చోట నిపుణుల సలహా తీసుకోవడం సురక్షితం.

Also Read: Mobile Charging: ఫోన్ 100% ఛార్జింగ్ పెడితే.. ఈ రిస్క్ తప్పదు

Artificial Intelligence: ఏఐని ఈ ఐదు విషయాలు అడిగారో.. మీ పని ఔట్!