Ishaq Dar: ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌కు ప్రమాదం జరిగింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన కాలు జారి పడిపోవడంతో భుజానికి గాయం అయింది. ఎక్స్‌రే పరీక్షల్లో ఆయనకు హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
మార్చి 29న ఇస్లామాబాద్‌లో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో జరిగిన కీలక సమావేశాన్ని ఇషాక్ దార్ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఈజిప్ట్ మంత్రి బదర్ అబ్దెలాతీకి స్వాగతం పలుకుతూ రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఫోటోలకు పోజులిస్తున్న సమయంలో ఆయన కాలు జారి కిందపడ్డారు. అయినప్పటికీ, నొప్పిని లెక్కచేయకుండా పెయిన్కిల్లర్లు తీసుకుని రోజంతా సమావేశాల్లో పాల్గొనడం గమనార్హం.
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయ శాంతి కోసం పాకిస్థాన్ చురుకుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు.
రాత్రి వైద్య పరీక్షల అనంతరం ఆయన గాయాల వివరాలను కుమారుడు అలీ దార్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read: Gold Rates: 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు
Ishaq Dar: రెడ్ కార్పెట్ పై నడుస్తుండగా.. కాలు జారి కింద పడ్డ పాక్ ఉప ప్రధాని
