Quiz: క్విజ్‌లో పాల్గొనండి.. రూ.25వేలు గెలుచుకోండి!

Opportunity to earn Rs 25,000, this government quiz will be a rain of prizes

Opportunity to earn Rs 25,000, this government quiz will be a rain of prizes

Quiz: భారత జాతీయ గేయం “వందే మాతరం” రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్విజ్ పోటీని ప్రారంభించింది. యువతలో దేశభక్తి భావనను పెంపొందించడం, భారత చరిత్రపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఈ క్విజ్ పోటీని కేంద్ర ప్రభుత్వ పౌర భాగస్వామ్య వేదిక అయిన MyGov వెబ్‌సైట్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు తమ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీతో వెబ్‌సైట్‌లో లాగిన్ అయి క్విజ్‌లో పాల్గొనవచ్చు.

ఈ క్విజ్‌లో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. వాటికి 300 సెకన్లలోపు సమాధానాలు ఇవ్వాలి. దేశ చరిత్ర, వందే మాతరం నేపథ్యం వంటి అంశాలపై ప్రశ్నలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ పోటీలో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులను కూడా ప్రకటించారు.

  • ప్రథమ బహుమతి: రూ.25,000
  • ద్వితీయ బహుమతి: రూ.15,000
  • తృతీయ బహుమతి: రూ.10,000

అదనంగా మరో 150 మందికి ప్రోత్సాహక బహుమతిగా రూ.3,000 చొప్పున నగదు ఇవ్వనున్నారు. అలాగే ఈ క్విజ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.

విద్యార్థులు, యువతతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశ చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఈ క్విజ్‌లో పాల్గొని తమ జ్ఞానాన్ని పరీక్షించుకోవడంతో పాటు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ పోటీలో పాల్గొనే చివరి తేదీ ఏప్రిల్ 15గా నిర్ణయించారు.

వెబ్‌సైట్:
https://quiz.mygov.in/quiz/vande-mataram-150-years-quiz/

Also Read: Best Cars: ఫస్ట్ టైం కారు కొంటున్నారా.. ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ మోడళ్లు ఇవే!

Quiz: క్విజ్‌లో పాల్గొనండి.. రూ.25వేలు గెలుచుకోండి!