Khamenei: ఖమేనీ లేరన్న వార్తను ఏడ్చుకుంటూ చదివిన యాంకర్

Iranian anchor sobs on state TV as he announces Khamenei killed in ‘criminal’ US-Israeli airstrikes

Iranian anchor sobs on state TV as he announces Khamenei killed in ‘criminal’ US-Israeli airstrikes

Khamenei: ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఈ వార్తను టీవీలో చదువుతున్న యాంకర్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తమ దేశానికి ఇది తీరని లోటు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ పేరుతో శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భారీ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా మారిందని, అక్కడ జరిగిన తీవ్ర దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అలాగే ఆయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా మృతిచెందినట్లు సమాచారం వెలువడింది.

ఖమేనీ మరణం దేశానికి పెద్ద నష్టం అని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయనకు గౌరవ సూచకంగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, తమ సుప్రీం నేత మృతికి తగిన సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టమని, ఇజ్రాయెల్ మరియు అమెరికాపై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.

ఈ పరిణామాలతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Tirumala: నాపై చర్యలు తీసుకుంటారట. అందరూ హ్యాపీగా ఉండండి.. గీతూ రాయల్ పై చర్యలు?

Khamenei: ఖమేనీ లేరన్న వార్తను ఏడ్చుకుంటూ చదివిన యాంకర్