Gold Rates: పసిడి ప్రియులకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలోనే ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం నాలుగు గంటల్లోనే 24 క్యారెట్ల తులం బంగారం ధరపై సుమారు రూ.810 తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280గా ఉంది. ఉదయం ఇది రూ.1,48,080 వద్ద ఉండగా తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం రూ.1,35,740గా ఉండగా ప్రస్తుతం రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడతో పాటు ముంబై, పూణె, బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,000 వద్ద స్థిరపడింది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,47,430గా ఉంది. ఉదయం ఇది రూ.1,48,080గా ఉండగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం రూ.1,35,740గా ఉండగా ప్రస్తుతం రూ.1,35,150 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,370గా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే, ఇటీవల బంగారం బాటలోనే తగ్గిన వెండి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,45,000గా ఉండగా, హైదరాబాద్‌లో రూ.2,50,000 వద్ద ఉంది. ఈ రోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు.
Also Read: Condom Shortage: మొన్నటిదాకా గ్యాస్, పెట్రోల్.. ఇప్పుడు కండోమ్
Gold Rates: 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు
