Suprem Court: పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు

'Don't Trust Anyone' : Supreme Court Advises Caution In Physical Relations Before Marriage

'Don't Trust Anyone' : Supreme Court Advises Caution In Physical Relations Before Marriage

Suprem Court: పెళ్లికి ముందే సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత కాలంలో ప్రేమ, లీవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో, వివాహానికి ముందే శారీరక సంబంధాలపై అతి విశ్వాసం పెట్టకూడదని ధర్మాసనం సూచించింది. అబ్బాయి, అమ్మాయి మధ్య పెళ్లి జరగకముందు పూర్తిగా పరిచయం ఏర్పడిందని అనుకున్నా, చట్టపరంగా వారు అపరిచితులే అవుతారని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఒక మహిళకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ, దుబాయ్ వంటి ప్రదేశాల్లో అనేకసార్లు ఇద్దరూ ఏకాంతంగా గడిపి శారీరకంగా కలిశారని వివరాలు వెల్లడయ్యాయి. కొంతకాలానికి మహిళ పెళ్లి కోసం ఒత్తిడి చేయగా, ఆ వ్యక్తి నిరాకరించాడు. అంతేకాకుండా కలిసి గడిపిన సమయంలో తీసిన వీడియోలను చూపించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణలో అతడికి ఇప్పటికే మరో మహిళతో పెళ్లి జరిగిన విషయం బయటపడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, వివాహం చేసుకుంటానని మోసం చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 16న ఈ పిటిషన్‌ను విచారించింది.

విచారణ సమయంలో ధర్మాసనం మాట్లాడుతూ, పెళ్లికి ముందు ఎంత నమ్మకం ఉన్నా పూర్తిగా విశ్వసించకూడదని సూచించింది. జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానిస్తూ, “మేము పాత తరానికి చెందినవాళ్లమేమో కానీ, వివాహానికి ముందు అబ్బాయి-అమ్మాయి మధ్య శారీరక సంబంధం విషయంలో చాలా జాగ్రత్త అవసరం” అని తెలిపారు. అలాగే బాధితురాలిని కూడా ఎందుకు అతడిని పూర్తిగా నమ్మి ఇతర ప్రదేశాలకు వెళ్లారని ప్రశ్నించింది.

ఇలాంటి కేసుల్లో పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఇరుపక్షాలను మధ్యవర్తిత్వానికి (మెడియేషన్) పంపాలని ధర్మాసనం సూచించింది. అనంతరం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Also Read: Plane: 120kmph వేగంతో వెళ్తున్న రైలుపై విమానం ల్యాండ్!

Suprem Court: పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు