Jowar Roti: రాత్రిళ్లు జొన్న రొట్టెలు తింటున్నారా?

Reasons why you must switch to Jowar Roti today

Reasons why you must switch to Jowar Roti today

Jowar Roti: పూర్వ కాలంలో ప్రజల ప్రధాన ఆహారం జొన్నలే. తెల్ల అన్నం మాత్రం పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తినేవారు. అందుకే అప్పటి ప్రజలు ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేవారు. వృద్ధాప్యంలో కూడా కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ వంటి సమస్యలు చాలా తక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం జీవనశైలి మారిపోవడంతో జంక్ ఫుడ్ ఎక్కువైంది. చిన్న వయసులోనే అనేక రోగాలు వస్తున్నాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా జొన్నలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

జొన్నలతో చేసే రొట్టెలు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం తగ్గుతుంది. పేగుల్లో మల చలనం సరిగా జరిగేలా సహాయపడుతుంది. అలాగే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దీంతో శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.

జొన్నలు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జొన్నల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. ఫైబర్ కారణంగా షుగర్ నియంత్రణలో ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి జొన్న రొట్టెలు మంచి ఆహారంగా చెప్పవచ్చు.

జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. అందువల్ల గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు కూడా భయపడకుండా తినవచ్చు. అలాగే ఇందులో బి-విటమిన్లు (నియాసిన్, థయామిన్, రైబోఫ్లేవిన్) సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. క్యాలరీలు ఖర్చవడానికి సహాయపడతాయి. శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం కండరాలను సడలించి నొప్పులను తగ్గిస్తుంది. కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను బలంగా ఉంచుతాయి.

జొన్నలతో అనేక రకాల వంటకాలు చేయవచ్చు. కానీ జొన్న రొట్టెలు చాలా ప్రసిద్ధి. రొట్టెల పిండిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు కలిపి తయారు చేస్తే రుచితో పాటు పోషకాలు కూడా పెరుగుతాయి. నూనె ఎక్కువగా వాడకుండా, కొద్దిగా నెయ్యి ఉపయోగిస్తే ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవారు రాత్రి సమయంలో ఒకటి లేదా రెండు జొన్న రొట్టెలు తింటే మంచి ఫలితం ఉంటుంది. సాధారణంగా ఒక రొట్టెతోనే సరిపోతుంది. జొన్న రొట్టెలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభించడంతో పాటు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read: April Fools Day: ‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చిందంటే?

Jowar Roti: రాత్రిళ్లు జొన్న రొట్టెలు తింటున్నారా?