Knee Pain: మోకాళ్ల నొప్పులకు బెస్ట్ మెడిసిన్.. రూపాయి కూడా పెట్టక్కర్లే..!

putta mannu is Best Remedy for knee pain

putta mannu is Best Remedy for knee pain

Knee Pain: పూర్వకాలంలో ఉపయోగించిన సహజ చికిత్స పద్ధతులను ఇప్పటికీ కొంతమంది ఆయుర్వేద నిపుణులు తిరిగి పరిచయం చేస్తున్నారు. అలాంటి చిట్కాల్లో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి సర్జరీలు, మందులు అవసరం లేకుండా ఉపశమనం పొందే మార్గాన్ని ఆయుర్వేద వైద్యుడు ప్రదీప్ వానపల్లి సూచిస్తున్నారు.

ఇప్పటి జీవనశైలి మార్పుల వల్ల చాలా మందికి 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్ల తర్వాత వచ్చే ఈ సమస్య ఇప్పుడు ముందుగానే కనిపిస్తోంది. ఎముకలు బలహీనపడటం, విశ్రాంతి లేకుండా పని చేయడం వంటి కారణాలతో ఈ సమస్య పెరుగుతోంది. కొంతమంది తీవ్ర నొప్పితో సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. అయితే సహజమైన మార్గంలో కూడా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చని ఆయన చెబుతున్నారు.

ఈ చిట్కాలో ముఖ్యంగా ఉపయోగించేది ‘పుట్టమన్ను’ (సహజ మట్టి). సాధారణంగా మనం పెద్దగా పట్టించుకోని ఈ మట్టిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముందుగా పుట్టమన్నును తీసుకుని మెత్తగా పొడి చేయాలి. దాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవచ్చు.

వాడే విధానం చాలా సులభం. ఒక పల్చని కాటన్ గుడ్డ తీసుకుని, అందులో పుట్టమన్ను పొడి వేసి, కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఆ తర్వాత ఆ గుడ్డను నొప్పి ఉన్న చోట కట్టాలి. ఉదాహరణకు మోకాళ్ల నొప్పి ఉంటే, నొప్పి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ కట్టు ఉండేలా చూడాలి. ఇది ఎండిపోకుండా మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు చల్లి తడి ఉంచాలి. రోజుకు కనీసం రెండు సార్లు, ఉదయం మరియు సాయంత్రం ఇలా చేస్తే మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంది.

పుట్టమన్నులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపు తగ్గించి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచి కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆర్థ్రైటిస్ వంటి సమస్యలకూ ఇది ఉపశమనం ఇవ్వొచ్చని అంటున్నారు.

కేవలం కీళ్ల నొప్పులకే కాకుండా చర్మ సమస్యలకు కూడా పుట్టమన్ను ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడం, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలకు పేస్ట్‌గా రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. జుట్టుకు కూడా ఇది నేచురల్ కండీషనర్‌లా పనిచేసి మృదువుగా మార్చుతుంది.

అయితే, ఇవి సాధారణ సమాచారం మాత్రమే. ఇవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. ఇలాంటి చిట్కాలను అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read: Knee Pain: ఇలా చేస్తే.. మోకాళ్ల నొప్పులన్న మాటే ఉండదు..!

Knee Pain: మోకాళ్ల నొప్పులకు బెస్ట్ మెడిసిన్.. రూపాయి కూడా పెట్టక్కర్లే..!