Kitchen Vastu: వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉండాలంటే..

Kitchen Direction Guide as per Vastu Shastra

Kitchen Direction Guide as per Vastu Shastra

Kitchen Vastu: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వంటగది కేవలం ఆహారం తయారుచేసే స్థలం మాత్రమే కాదు. అది అన్నపూర్ణ దేవి నివసించే పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అందుకే వంటగదిలో వాస్తు సరిగా లేకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అగ్ని మూలకానికి సంబంధించిన గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ విషయంలో కొన్ని నియమాలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు.

గ్యాస్ స్టవ్ పెట్టే దిశ

వాస్తు శాస్త్రం ప్రకారం అగ్ని మూలకానికి సంబంధించిన వస్తువులను ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఈ దిశలో గ్యాస్ స్టవ్ లేదా సిలిండర్ ఉంటే ఇంట్లో శక్తి సమతుల్యత ఉంటుందని నమ్మకం. ఒకవేళ ఆగ్నేయ దిశలో అవకాశం లేకపోతే తూర్పు దిశలో కూడా స్టవ్ ఉంచుకోవచ్చు.

ఈ దిశల్లో పెట్టకూడదు

గ్యాస్ సిలిండర్ లేదా స్టవ్‌ను ఈశాన్యం లేదా ఉత్తర దిశల్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర దిశ నీటి మూలకానికి సంబంధించినది. నీరు మరియు అగ్ని ఒకదానికొకటి విరుద్ధమైన మూలకాలు. అందుకే ఈ దిశల్లో అగ్ని సంబంధిత వస్తువులు ఉంచితే ఇంట్లో అశాంతి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు.

పరిశుభ్రత కూడా ముఖ్యం

గ్యాస్ స్టవ్ ఉన్న ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండటం చాలా అవసరం. అపరిశుభ్రత వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందని వాస్తు చెబుతుంది. అదే సమయంలో ఇది ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు. కాబట్టి వంట పూర్తయ్యాక స్టవ్ పరిసరాలను శుభ్రం చేయడం మంచిది.

స్టవ్ కొనడానికి మంచి రోజు

కొత్తగా గ్యాస్ స్టవ్ కొనాలనుకునే వారు గురువారం రోజు కొనుగోలు చేయడం శుభప్రదం అని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఆ రోజున కొనుగోలు చేస్తే ఇంట్లో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం ఉంది.

Also Read: PhonePe: ‘ఫోన్‌ పే’ కార్డ్‌.. నెట్‌ లేకున్నా డబ్బులు పంపొచ్చు

Kitchen Vastu: వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉండాలంటే..