Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఎన్ని కిటికీలు, తలుపులు ఉండాలంటే..

How Many Doors and Windows as per Vastu

How Many Doors and Windows as per Vastu

Vastu: ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల మధ్య ఉండే స్థలం మాత్రమే కాదు. అది మనకు మానసిక ప్రశాంతతను, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ప్రదేశం. ఇంటి నిర్మాణంలో తలుపులకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, కిటికీలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. కిటికీలు కేవలం గాలి, వెలుతురు కోసం మాత్రమే కాకుండా ఇంటి వాస్తుపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కిటికీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కిటికీల సంఖ్య ఎలా ఉండాలి?

ఇల్లు నిర్మించే సమయంలో చాలామంది కిటికీల సంఖ్యను పెద్దగా పట్టించుకోరు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కిటికీలు సరి సంఖ్యలో ఉండటం మంచిది. అంటే 2, 4, 6, 8, 10 వంటి సంఖ్యలు అనుకూలంగా భావిస్తారు. 3, 5, 7, 9 వంటి బేసి సంఖ్యల్లో కిటికీలు ఉంటే ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఏ దిశలో కిటికీలు ఉండాలి?

కిటికీల దిశ కూడా చాలా ముఖ్యమైనది. తూర్పు లేదా ఉత్తర దిశల్లో కిటికీలు ఉంటే ఉదయం సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తాయి. ఇది ఇంట్లో ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. పడమర లేదా దక్షిణ దిశల్లో కిటికీలు ఉంటే అవి పరిమాణంలో కొంచెం చిన్నవిగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

పరిమాణం మరియు నిర్వహణ

కిటికీల అమరికలో కొన్ని విషయాలు తప్పనిసరిగా గమనించాలి.

  • సమాన ఎత్తు: ఇంట్లో ఉన్న కిటికీలు ఎక్కువగా ఒకే ఎత్తులో ఉండేలా చూడాలి. ఒకటి పెద్దది, మరొకటి చాలా చిన్నదిగా ఉండకూడదు.
  • పరిశుభ్రత: కిటికీలు ఎప్పుడూ దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచాలి. అద్దాలు విరిగిపోయినా లేదా కిటికీలు శబ్దం చేసినా వెంటనే బాగు చేయించాలి.
  • తెరవడం – మూసివేయడం: పగటిపూట కొంతసేపు కిటికీలు తెరిచి ఉంచితే గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చి ప్రతికూల శక్తి బయటకు వెళ్లిపోతుంది. అయితే సాయంత్రం చీకటి పడిన తర్వాత కిటికీలను మూసివేయడం మంచిది.

ఇలా ఇంటి అలంకరణతో పాటు చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. కొత్త ఇల్లు కడుతున్నా లేదా పాత ఇంట్లో మార్పులు చేయాలనుకున్నా కిటికీల వాస్తును కూడా ఒకసారి పరిశీలించడం మంచిది.

Also Read: Kitchen Vastu: వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉండాలంటే..

Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఎన్ని కిటికీలు, తలుపులు ఉండాలంటే..