ప్రత్యేకంగా నూనెలో వేయించిన పదార్థాలు, అధిక చక్కెర ఉన్న స్వీట్స్, జంక్ ఫుడ్స్ వంటి వాటిని సాయంత్రం సమయంలో తప్పించుకోవాలి. సమోసాలు, పకోడీలు, బజ్జీలు వంటి ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో కొవ్వు త్వరగా పెరుగుతుంది. అలాగే పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్‌లో అధిక కేలరీలు ఉండటంతో బరువు పెరగడానికి కారణమవుతాయి. డెజర్ట్స్, అధిక షుగర్ ఉన్న స్వీట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని ప్రభావం ఇన్సులిన్ ఉత్పత్తిపై పడుతుంది.
సాయంత్రం వేళ మసాలాలు, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మంట వంటి సమస్యలు రావచ్చు. ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల కడుపులో మంట ఎక్కువవుతుంది. జంక్ ఫుడ్స్‌లో ఉండే అధిక కేలరీలు శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీర్ఘకాలంలో ఇవి ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్యాలకు దారితీస్తాయి.
అయితే సాయంత్రం ఆకలి వేసినప్పుడు పూర్తిగా ఆహారం మానేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించిన మఖానా మంచి ఎంపిక. ఉడికించిన స్వీట్ కార్న్ కూడా శరీరానికి మేలు చేస్తుంది. వేడి కూరగాయల సూప్ తీసుకోవడం ఉత్తమం. తక్కువ నూనెతో చేసిన పనీర్ ఫ్రై లేదా స్పైసీ చిక్‌పీస్ తీసుకోవచ్చు. గోధుమ పిండితో చేసిన కుడుములు కూడా ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడతాయి.
మొత్తంగా చెప్పాలంటే, సాయంత్రం 6 గంటల తర్వాత జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్స్‌కు దూరంగా ఉండటం మంచిది. బదులుగా తేలికపాటి, పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా బరువు నియంత్రణతో పాటు అనేక వ్యాధులను కూడా దూరం పెట్టవచ్చు.