Viral: విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ వార్త ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు బయటకు రాకపోయినా, వీరిద్దరి నిశ్చితార్థం గురించి సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడిచింది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఇప్పటికే చాలామంది సినీ తారలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వారిలో చాలా మంది విడాకుల దారిన నడిచారు. అది జాతక ఫలితమో, లేక వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావమో తెలియదు కానీ సంబంధాలు నిలవలేదు. అయితే, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం జరగినా ఆ బంధం ఎక్కువకాలం నిలవదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ముందుగానే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన మాటల్లో, ఇద్దరి జాతకాల్లో అనేక దోషాలు ఉన్నాయట, పెళ్లి జరిగినా ఎక్కువ రోజులు కలిసి ఉండరట. ఈ విషయాన్ని రష్మికకు కూడా చెప్పినప్పటికీ, ఆమె పెద్దగా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరగడంతో వేణు స్వామి చేసిన ఆ జాతక వ్యాఖ్యలు మళ్లీ చర్చలోకి వచ్చాయి. ఎంగేజ్‌మెంట్ జరిగి వారం కూడా కాలకముందే యాక్సిడెంట్ జరగడంతో, “ఇది జాతక ప్రభావమేనా?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
వేణు స్వామి చెప్పిన పాత వీడియో మరోసారి వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే — సోమవారం సాయంత్రం గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారిపై విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. ఆయన పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణంలో ఉండగా, ముందున్న బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, విజయ్ కారు ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది.
అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు, కానీ కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలు 2026 ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారు.
ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తోందని, అత్యంత సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది. అంతేకాక, ఈ ఉదయం విజయ్ ఇంట్లో ఫ్యామిలీ మీటింగ్ జరిగి, పెళ్లికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.
