‘OG’ OTT Release: ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

'OG' OTT release: Pawan Kalyan's action flick to start streaming on THIS date

'OG' OTT release: Pawan Kalyan's action flick to start streaming on THIS date

‘OG’ OTT Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, దసరా పండగ కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన తొలి షో నుంచే సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పవన్ కెరీర్‌లోనే సర్వత్కృష్టమైన బ్లాక్‌బస్టర్గా నిలిచింది.

సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో స్వాగ్, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటన, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే తమన్ అందించిన బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇటీవల టికెట్ ధరలు తగ్గించడంతో, మళ్లీ థియేటర్లలో కలెక్షన్లు ఊపందుకున్నాయి. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన వివరాల ప్రకారం, ఓజీ మొత్తం రూ. 368 కోట్ల వసూళ్లు సాధించింది. ఇంకా అనేక థియేటర్లలో ఈ సినిమా హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్తోంది.

ఇకపోతే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓజీ ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ ప్రారంభమయ్యేలా ముందుగానే ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. ఆ ఒప్పందం ప్రకారం, అక్టోబర్ 23 నుంచి ఓజీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

సెన్సార్ కారణంగా థియేటర్ వెర్షన్‌లో కొన్ని సీన్లు తొలగించబడగా, ఓటీటీ వెర్షన్‌లో ఆ అదనపు సన్నివేశాలు చేర్చనున్నారని సమాచారం. అంతేకాకుండా, నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కూడా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సమాచారం ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించబడలేదు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుహాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు వంటి తారాగణం కీలక పాత్రల్లో మెరిశారు. సినిమాకు తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read: Tragedy: విషాదం.. భార్యతో డాన్స్ చేస్తూ మృతి

‘OG’ OTT Release: ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?