Credits Cards: ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు.. మీకు తెలుసా?

A Man with 1638 Credit Cards? Unbelievable but True!

A Man with 1638 Credit Cards? Unbelievable but True!

Credits Cards: సాధారణంగా మనలో చాలా మందికి ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులు ఉంటాయి. అయితే వాటికంటే ఎక్కువ ఉంటే అది తలకు మించిన భారంగా మారుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌కు చెందిన మనీష్ ధమేజా అనే వ్యక్తి ఈ విషయంలో అందరికీ భిన్నంగా నిలిచాడు. ఆయన దగ్గర ఒక్కటి, రెండు కాదు, 1,638 క్రెడిట్ కార్డులు ఉన్నాయి! అంతేకాదు, ఈ విశేష సేకరణతో ఆయన ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.

2021 ఏప్రిల్ 30న, అత్యధికంగా చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులు కలిగిన వ్యక్తిగా మనీష్ ధమేజా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. మనీష్‌కు క్రెడిట్ కార్డులు కేవలం ఆర్థిక సాధనాలు మాత్రమే కాకుండా, ఆయన జీవితంలోని భాగమని చెప్పొచ్చు. “క్రెడిట్ కార్డులు లేకుండా నా జీవితం అసంపూర్ణంగా ఉంటుంది” అని ఆయన ప్రేమగా చెప్పారు. తాను వాటితో పొందే రివార్డులు, ఆఫర్లు, ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయని ఆయన వెల్లడించారు.

క్రెడిట్ కార్డుల ద్వారా మనీష్ అనేక ప్రత్యేక సౌకర్యాలను పొందుతున్నారు. ఆయనకు కాంప్లిమెంటరీ ట్రావెల్, రైల్వే మరియు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫుడ్ మరియు స్పా సేవలు, హోటల్ వోచర్లు, డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లు, షాపింగ్ మరియు సినిమా వోచర్లు, గోల్ఫ్ సెషన్లు, ఇంతేకాకుండా ఇంధన సౌకర్యం కూడా లభిస్తోంది. ఇవన్నీ ఆయనకు అపారమైన ఆనందాన్ని ఇస్తున్నాయని తెలిపారు.

అతని జీవితంలో 2016 నవంబర్ 8 ఒక ప్రత్యేకమైన రోజు. అదే రోజు భారత ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా గందరగోళాన్ని రేపినప్పటికీ, మనీష్ మాత్రం ప్రశాంతంగా జీవించాడు. ఎందుకంటే ఆయన వద్ద ఉన్న క్రెడిట్ కార్డుల వల్ల నగదు అవసరం లేకుండా డిజిటల్‌గా తన ఖర్చులను కొనసాగించగలిగాడు.

“ఇతరులు బ్యాంకుల వద్ద క్యూల్లో నిలబడ్డప్పటికీ, నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా రోజువారీ పనులు పూర్తి చేయగలిగాను” అని మనీష్ గర్వంగా చెప్పారు. ఆయనకు, క్రెడిట్ కార్డులు ఆర్థిక స్వేచ్ఛకు చిహ్నం మాత్రమే కాకుండా, రివార్డులు సంపాదించే ఆనందాన్ని కూడా ఇస్తాయి. ఈ విభిన్న అభిరుచితో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

Also Read: Viral: విజయ్ దేవరకొండకు ప్రమాదం.. రష్మిక వల్లేనా!

Credits Cards: ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు.. మీకు తెలుసా?