Trisha: త్రిషకు ఆల్రెడీ పెళ్లైందా?.. పిల్లలు కూడా ఉన్నారా..?

Trisha Krishnan viral rumours about Marriage & Children

Trisha Krishnan viral rumours about Marriage & Children

Trisha: త్రిష సినీ కెరీర్‌తో పాటు ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా గత రెండు మూడు నెలలుగా ఆమె పేరు విజయ్ దళపతితో లింక్ చేస్తూ వచ్చిన రూమర్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. అయితే వీటిపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.

42 ఏళ్ల వయసులో కూడా త్రిష పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా కొనసాగుతోంది. ఆమె గ్లామర్ చూసి అసూయపడని వారు ఉండరు అనిపిస్తుంది. వయసు పెరుగుతున్నా, ఆమె అందం మాత్రం తగ్గకుండా ఇంకా యువతిలా కనిపిస్తుండటం అభిమానులను ఆకట్టుకుంటోంది.

త్రిష సినీ ప్రయాణం విషయానికి వస్తే, తరుణ్ హీరోగా నటించిన “నీ మనసు నాకు తెలుసు” సినిమాతో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రభాస్‌తో చేసిన “వర్షం” సినిమా ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. తరువాత “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”, “అతడు” వంటి సినిమాలతో వరుస విజయాలు సాధించి తెలుగులో దాదాపు దశాబ్దం పాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగింది.

ఇక ఆమె వ్యక్తిగత సంబంధాల గురించి కూడా ఎన్నో గాసిప్స్ వచ్చాయి. గతంలో శింబుతో ప్రేమలో ఉందని, తరువాత సిద్దార్థ్‌తో రిలేషన్‌లో ఉందని, అలాగే రానాతో కూడా కొంతకాలం డేటింగ్ చేసిందని వార్తలు వినిపించాయి. ఇటీవల విజయ్‌తో కూడా ప్రేమలో ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మాత్రం స్పష్టంగా తెలియదు.

ఇటీవల ప్రముఖ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఒక ఇంటర్వ్యూలో త్రిష త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టబోతుందని అన్నారు. దీనిపై త్రిష ఘాటుగా స్పందించింది. తన ఎక్స్ (ట్విట్టర్)లో “అవును, నేను సినిమాలు మానేశాను, పెళ్లి కూడా చేసుకున్నాను, నాకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? లేక ఇంకేమైనా కావాలా?” అంటూ వ్యంగ్యంగా స్పందించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, గతంలో త్రిష ఒక బిజినెస్‌మ్యాన్ వరుణ్‌తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై, ఎంగేజ్‌మెంట్ కూడా జరుపుకుంది. కానీ పెళ్లికి ముందు ఇద్దరూ విడిపోయారు. ఈ బ్రేకప్‌కు కారణాలపై పలు వార్తలు వచ్చినా, అసలు నిజం ఏమిటో బయటకు రాలేదు.

ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. చిరంజీవితో కలిసి “విశ్వంభర” సినిమాలో నటిస్తోంది. అలాగే సూర్య హీరోగా తెరకెక్కుతున్న “కరుప్పు” చిత్రంలో కూడా కనిపించనుంది. త్రిష తన కెరీర్‌లో చిరంజీవి తరం నుంచి ఇప్పటి యువ హీరోల వరకు దాదాపు అందరితో కలిసి నటించి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Also Read: Knee Pain: మోకాళ్ల నొప్పులకు బెస్ట్ మెడిసిన్.. రూపాయి కూడా పెట్టక్కర్లే..!
Trisha: త్రిషకు ఆల్రెడీ పెళ్లైందా?.. పిల్లలు కూడా ఉన్నారా..?