Singer Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు

Legendary singer Asha Bhosle admitted to Breach candy hospital due to chest infection, her granddaughter requests for privacy

Legendary singer Asha Bhosle admitted to Breach candy hospital due to chest infection, her granddaughter requests for privacy

Singer Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోస్లే ప్రస్తుతం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

ఈ విషయంపై ఆశా భోస్లే మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో స్పందిస్తూ, “మా అమ్మమ్మకు తీవ్రమైన అలసటతో పాటు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేర్చాం. చికిత్స కొనసాగుతోంది. దయచేసి మా గోప్యతను గౌరవించండి. ఆమె త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. పరిస్థితి గురించి మేము మీకు తెలియజేస్తూనే ఉంటాము” అని తెలిపారు.

92 ఏళ్ల వయసున్న ఆశా భోస్లే, 80 ఏళ్లకు పైగా తన గాత్రంతో భారతీయ చిత్రసీమను ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి ప్రత్యేక గుర్తింపు పొందారు. సంగీత రంగంలో ఆమె చేసిన సేవలకు గాను 2 జాతీయ అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ విభూషణ్ వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. అంతేకాకుండా, అత్యధిక పాటలు పాడిన గాయని గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు.

ఆమె పాడిన అనేక పాటలు శ్రోతలను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ‘హే రామ్’ సినిమాలోని ‘నీ పార్థ పార్వైక్కు ఒరు నాట్రా’, ‘అలైపాయుడే’లోని ‘సెప్టెంబర్ మంత్’, ‘చంద్రముఖి’ చిత్రంలోని ‘కొంచ నేరం కొంచ నేరం’ వంటి పాటలు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి.

ఆమె అనారోగ్యంపై సమాచారం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Also Read: Viral: బూతులు మాట్లాడితే రూ.500 జరిమానా.. ఎక్కడంటే?

Singer Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు