Kantara: ‘థియేటర్లో అలాంటి పనులు అస్సలు చేయకండి ప్లీజ్’

Kantara Chapter 1 star Rishab Shetty urges fans to refrain from dressing as Daiva in theatres: ‘We do it for the cinematic experience’

Kantara Chapter 1 star Rishab Shetty urges fans to refrain from dressing as Daiva in theatres: ‘We do it for the cinematic experience’

Kantara: రిషబ్ శెట్టి (Rishabh Shetty) దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది. దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే అనేక రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఆరు రోజుల్లో దాదాపు రూ.427 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకో రెండు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా విజయంతో ఆనందంలో మునిగిపోయిన అభిమానులలో కొందరు థియేటర్లకు దైవ వేషధారణలో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రిషబ్ శెట్టి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ — “దైవ వేషధారణ మన సంప్రదాయంలో పవిత్రమైనది. దానికి ఉన్న ఆధ్యాత్మికత, భక్తి భావనలను గౌరవించడం మనందరి కర్తవ్యం. థియేటర్లలో ఆ వేషాలతో ప్రవేశించడం సాంప్రదాయాన్ని తప్పుగా చూపించే చర్య అవుతుంది. దయచేసి ఎవ్వరూ అలాంటి పనులు చేయకండి. మన సంప్రదాయం పవిత్రతను కాపాడుకుందాం,” అని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

రిషబ్ శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన ఈ మాటలు అభిమానుల నుండి మంచి స్పందనను పొందుతున్నాయి.

Also Read: Tragedy: బాంబుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు స్పాట్ లోనే..

Kantara: ‘థియేటర్లో అలాంటి పనులు అస్సలు చేయకండి ప్లీజ్’