Amazon: అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఐఫోన్ ప్రేమికులకు ఇది అద్భుతమైన అవకాశంగా మారింది. అమెజాన్ ఇప్పుడు ఐఫోన్ 15 పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. భారత్‌లో దీని అసలు ధర రూ.69,900గా ఉండగా, సేల్ ఆఫర్‌లో దీన్ని రూ.47,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
2023లో విడుదలైన ఈ మోడల్ ఇప్పటికీ రూ.50,000 లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది మిస్ కాకూడని ఆఫర్. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15ను రూ.11,901 తగ్గింపు ధరతో కేవలం రూ.47,999కే అందిస్తున్నారు. అదనంగా, అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.1,439 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.
అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIలపై రూ.500 వరకు బ్యాంక్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఫోన్‌ను మరింత తక్కువ ధరకే పొందవచ్చు. నెలకు రూ.2,327 నుంచి ప్రారంభమయ్యే నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాక, పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేస్తే, దాని కండిషన్ ఆధారంగా రూ.43,950 వరకు తగ్గింపు పొందవచ్చు.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఐఫోన్ 15లో 6.1 అంగుళాల OLED డిస్ప్లే ఉంది, ఇది 60Hz రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది. ఇందులో A16 బయోనిక్ చిప్ ఉండగా, గేమింగ్ నుంచి మల్టీటాస్కింగ్ వరకు వేగవంతమైన పనితీరును అందిస్తుంది. కెమెరా పరంగా 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఈ ఫోన్‌కి IP68 రేటింగ్ లభించింది.
