Oscar Award: ఆస్కార్‌ అవార్డు‌ను అమ్ముకోవచ్చా.. అమ్మితే ఎంతొస్తుంది?

How Much Is an Oscar Really Worth? Breaking Down the Price of the Academy Award Statue

How Much Is an Oscar Really Worth? Breaking Down the Price of the Academy Award Statue

Oscar Award: ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్ అవార్డు. ప్రతి సినిమా దర్శకుడు, నటుడు లేదా టెక్నీషియన్ ఈ అవార్డు దక్కించుకోవాలని ఆశపడతారు. అంతటి గొప్ప గుర్తింపుగా భావించే ఈ అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఒకవేళ అమ్మాలనుకుంటే ఎంత ధర వస్తుంది అనే ఆసక్తి కూడా సహజంగానే ఉంటుంది.

ఆస్కార్ అవార్డును అధికారికంగా అకాడమీ అవార్డ్స్ అని పిలుస్తారు. 1929లో డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్, విలియం డెమిల్ కలిసి ఈ అవార్డులను ప్రారంభించారు. సినిమా రంగంలో ప్రతిభ చూపిన కళాకారులను గౌరవించడానికి ఈ అవార్డులను అందజేస్తారు. ప్రారంభమైన కొద్ది కాలంలోనే ఆస్కార్ అవార్డులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు వచ్చింది.

చూడటానికి ఈ అవార్డు బంగారంతో తయారైనట్టుగా కనిపించినప్పటికీ, ఇది పూర్తిగా గోల్డ్‌తో తయారు చేయబడదు. సుమారు 13.5 అంగుళాల ఎత్తు, 4 కిలోల బరువు ఉండే ఈ ట్రోఫీని మొదట్లో కాపర్‌తో తయారు చేసి దాని మీద గోల్డ్ కోటింగ్ వేసేవారు. ప్రస్తుతం కూడా ప్రత్యేకమైన మెటల్‌తో తయారు చేసి బంగారు పూత వేస్తున్నారు.

2017లో టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ఒక ఆస్కార్ అవార్డు తయారు చేయడానికి అకాడమీకి సుమారు 400 డాలర్లు ఖర్చవుతుంది. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ అవార్డును ఎవరైనా అమ్మాలని ప్రయత్నిస్తే వారికి కేవలం ఒక డాలర్ మాత్రమే లభిస్తుంది.

దీనికి కారణం 1950లో అకాడమీ తీసుకొచ్చిన ఒక ప్రత్యేక నిబంధన. 1950కు ముందు, ప్రముఖ అమెరికన్ దర్శకుడు ఆర్సన్ వెల్స్ తనకు వచ్చిన ఆస్కార్ అవార్డును వేలంలో పెట్టారు. ఆ వేలంలో ఆ అవార్డు సుమారు 6.5 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఈ ఘటన తర్వాత అకాడమీ కఠినమైన నియమాన్ని అమలు చేసింది.

ఆ నియమం ప్రకారం ఆస్కార్ విజేత ఎవరైనా తమ అవార్డును అమ్మాలని లేదా వేలం వేయాలని అనుకుంటే ముందుగా అకాడమీకి తెలియజేయాలి. అప్పుడు అకాడమీకి ఆ అవార్డును ఒక డాలర్‌కు తిరిగి కొనుగోలు చేసే హక్కు ఉంటుంది.

అందువల్ల ఆస్కార్ అవార్డును ఎవరైనా అమ్మాలని భావించినా వారికి లభించే మొత్తం కేవలం ఒక డాలర్ మాత్రమే. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 80–90 రూపాయల వరకు మాత్రమే వస్తుంది. అందుకే చాలా మంది ఈ అవార్డును అమ్మే ఆలోచనే చేయరు; అది వారికి జీవితాంతం గర్వకారణంగా నిలిచిపోతుంది.

Also Read: Osteoarthritis: మోకాళ్ళు ఎందుకు అరుగుతాయంటే..

Oscar Award: ఆస్కార్‌ అవార్డు‌ను అమ్ముకోవచ్చా.. అమ్మితే ఎంతొస్తుంది?